Begin typing your search above and press return to search.

స్వీటీ మైండ్ లో బికినీ థాట్??

By:  Tupaki Desk   |   6 July 2017 7:08 AM GMT
స్వీటీ మైండ్ లో బికినీ థాట్??
X
బాహుబలి2 సెన్సేషనల్ సక్సెస్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ సాహో. బాహుబలి ది కంక్లూజన్ తో పాటే టీజర్ కూడా ఇచ్చిన సాహో చిత్రానికి.. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా నటింపచేసేందుకు.. పలువురు బాలీవుడ్ భామలను సంప్రదించిన మేకర్స్.. ఇప్పటికి తుది నిర్ణయానికి వచ్చారట.

సాహో చిత్రంలో కూడా బాహుబలి కాంబోనే రిపీట్ చేయనున్నారట. అంటే ప్రభాస్ కి జోడీగా ఈ సినిమాలో కూడా అనుష్క నటించనుందని టాక్. పలువురు భామలను పరిశీలించిన తర్వాత.. చివరకు అనుష్కకు లాక్ అయినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనా.. ప్రభాస్ ఇంకా సెట్స్ లో తిరిగి జాయిన్ కాలేదు. బాహుబలి కోసం పెంచిన దేహాన్ని తగ్గించుకుని.. సన్నగా కనిపించేందుకు కష్టపడుతున్నాడు ప్రభాస్. మరోవైపు.. ఈసినిమాలో అనుష్క కూడా సన్నగా కనిపించనుందని.. అందుకోసం విపరీతంగా శ్రమిస్తోందని తెలుస్తోంది.

సాహో మూవీలో గ్లామరస్ రోల్ కావడంతో.. ఈ చిత్రంలో అనుష్క ఓ సీన్ లో బికినీలో కనిపించనుందని అంటున్నారు. కెరీర్ ప్రారంభంలో చేసిన బిల్లా తరహాలో స్వీటీ మరోసారి బికినీ వేసి.. గ్లామర్ పంచనుందట. గత కొంత కాలంగా ఈమెను అందరూ ఫ్యాటీ అంటూ ఆటపట్టిస్తుండడంతో.. ఇప్పుడు తన హాట్ సైడ్ చూపించేందుకు గాను.. ఈ బికినీ డెసిషన్ తీసుకుందని తెలుస్తోంది. అనుష్క సన్నగా కనిపించడం.. అందులోనూ బికినీతో దర్శనమివ్వడం.. అంతకంటే స్వీటీ అభిమానులకు ఇంకేం కావాలి.