Begin typing your search above and press return to search.

సన్నటి స్వీటీ సీక్రెట్ ఇదే!!

By:  Tupaki Desk   |   19 March 2017 11:22 AM IST
సన్నటి స్వీటీ సీక్రెట్ ఇదే!!
X
బాహుబలి ది కంక్లూజన్ ట్రైలర్ బోలెడన్ని రికార్డులు సృష్టించేస్తోంది. యూట్యూబ్ వ్యూస్ లో మరే సినిమాకి సాధ్యం కాదనే స్థాయిలో.. ఇండియన్ మూవీస్ తరఫున కొత్త రికార్డులు నమోదు చేస్తోంది.

ఈ ట్రైలర్ లో ఎన్నో ఆకట్టుకునే అంశాలు ఉండగా.. స్వీటీ అనుష్క కూడా ఒక మెయిన్ అట్రాక్షన్ గా చెప్పుకోవాలి. బాహుబలి2 ట్రైలర్ లో అనుష్క చాలా సన్నగా కనిపించింది. ట్రైలర్ లో అనుష్కకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగానే దక్కగా.. వీటిలో స్వీటీ సన్నగా కనిపించిన సీక్రెట్ ఇప్పుడు తెలిసిపోయింది. ట్రైలర్ లో ఉంచిన స్వీటీ షాట్స్ లో చాలా వరకూ.. నాలుగేళ్ల క్రితం తీసినవే ఉంచారట. ఒకట్రెండు షాట్స్ లేటెస్ట్ వి ఉన్నా.. వాటిపై రాజమౌళి చాలానే కసరత్తులు చేశాడట. గ్రాఫిక్స్ సహాయంతో.. నాలుగేళ్ల క్రితం అనుష్క ఎలా ఉందో.. అలాగే ఇప్పుడు కూడా కనిపించేలా జాగ్రత్త పడ్డాడట రాజమౌళి.

బాహుబలి మొదటి భాగంలో అనుష్క పాత్ర కేమియా మాదిరిగా అనిపిస్తుంది. కానీ రెండో భాగంలో స్టోరీ ఆమె రోల్ చుట్టూ తిరగడంతో పాటు.. ఆమెకు స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంటుందిట. పైగా మొదటి భాగం అంతా కేరక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే అని.. రెండో భాగంలోనే కథ చెబుతానని జక్కన్న కూడా అన్నాడు. అందుకే.. కీలకమైన అనుష్క రోల్ కి.. లుక్ విషయంలో బోలెడంత వర్క్ చేశాడట రాజమౌళి. అందుకే స్వీటీ ఇంత సన్నగా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/