Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: కృష్ణమ్మగా అనుష్క

By:  Tupaki Desk   |   6 Aug 2016 12:04 PM IST
ఫస్ట్ లుక్: కృష్ణమ్మగా అనుష్క
X
మహా భక్తురాలు కృష్ణమ్మగా అలరించనుంది హీరోయిన్ అనుష్క. ఇప్పటికే అరుంధతి, రుద్రమదేవి, దేవసేన వంటి పౌరాణిక పాత్రలను పోషించిన ఈ టాప్ హీరోయిన్ ఇప్పుడు నాగార్జున ప్రధాన ప్రాతలో రూపొందుతున్న ''ఓం నమో వేంకటేశాయ'' సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ సీరియల్స్ నటుడు సౌరభ పోషిస్టున్న శ్రీమహా విష్ణువు పాత్రను మోషన్ పోస్టర్ ద్వారా ఆవిష్కరించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇప్పుడు అనుష్క పాత్ర ఎలా ఉండబోతోందో ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఒక మహా భక్తురాలు ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది అనుష్క. అయితే కృష్ణమ్మ అనే పేరుతో కలియుగ అవతారమైన వేంకటేశ్వరుని భక్తురాలిగా కనిపించడం ఇంకా బాగుంది అంటున్నారు డివోషనల్ సినిమా లవర్స్.

ఈ సినిమాలో నాగార్జున 'హతీ రామ్ బాబా' పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రాఘవేంద్రరావు డైరక్షన్లో అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీసాయిబాబా వంటి సినిమాలను చేసిన నాగ్‌.. నవతరం దేవుళ్ళ సినిమాల కథానాయకుడిగా ఈ సినిమాతో నీరాజనాలు అందుకోవడం ఖాయం.