Begin typing your search above and press return to search.

నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే...

By:  Tupaki Desk   |   31 Oct 2015 7:30 PM GMT
నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే...
X
తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ ఎవరు.. అసలు ఈ ఫస్ట్ ప్లేస్ కి ఎప్పుడూ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఓ పదేళ్ల క్రితం వరకూ అయితే కరెక్ట్ గా పేరు చెప్పగలిగే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఎవరి ఖాతాలో ఎక్కువ హిట్స్ ఉంటే.. వాళ్లే ఆ సీజన్ కి నెంబర్ వన్ అనే పరిస్థితి వచ్చేసింది. హీరో హీరోయిన్లకే కాదు.. కేరక్టర్ ఆర్టిస్టులు - కమెడియన్లు కూడా ఇదే సూత్రం పాటించేస్తున్నారు.

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేస్ లో ముఖ్యంగా నలుగురి హీరోయిన్స్ పేరు చెప్పుకోవాలి. మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పుడూ రేస్ లో ఉంటుంది కానీ.. తమ్మూ దుమ్ము లేపుతుంది అన్ని సినిమాలు పెద్దగా ఆడవు. ఒకవేళ ఆడినా ఆ క్రెడిట్ ఈమెకు దక్కదు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సమంత గురించే. ఏడాది క్రితం వరకూ సింహాసనం నాదే అన్నట్లుండేది పరిస్థితి. కానీ ఇప్పుడు కోలీవుడ్ పై దృష్టి పెట్టి తెలుగులో సినిమాలు తగ్గించేసింది. అ.. ఆ.. - బ్రహ్మోత్సవం లాంటి ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి కాబట్టి రేసులో ఉంది కానీ.. లేకపోతే అసలు కౌంట్ లోనే ఉండేది కాదు.

నెంబర్ వన్ రేసులో ఉండే మరో సొగసరి శృతిహాసన్. గతేడాది రేసుగుర్రం - ఈ ఏడాది శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్స్ తో మంచి ఊపు మీదుంది. ఫస్ట్ ప్లేస్ టఫ్ కాంపిటీషన్ ఇస్తూ దగ్గరికొచ్చేసింది. ఇక లాస్ట్ చెప్పుకున్నా.. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న హీరోయిన్ గా అనుష్కనే చెప్పాలి. బాహుబలి - రుద్రమదేవి లాంటి భారీ హిట్ లను సాధించింది. అంతేనా సైజ్ జీరో అంటూ మరో క్రేజీ ప్రాజెక్టును లాంఛ్ చేయబోతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి సింగిల్ ఆప్షన్ అవుతోంది. అందుకే.. ఇప్పటికి, ఈ ఏడాదికి నెంబర్ వన్ అనుష్క. ఎనీ డౌట్స్?