Begin typing your search above and press return to search.

జీరో పోస్ట‌ర్స్.. పొట్టోడు గ‌ట్టోడే!

By:  Tupaki Desk   |   1 Nov 2018 5:23 AM GMT
జీరో పోస్ట‌ర్స్.. పొట్టోడు గ‌ట్టోడే!
X
కింగ్ ఖాన్ షారూక్ కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత ఎంతో క‌సిగా న‌టిస్తున్న సినిమా `జీరో`. ఖాన్‌ ల త్ర‌యంలో రేసులో వెన‌క‌బ‌డిన షారూక్ ఈసారి ఎట్టిప‌రిస్థితిలో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. అందుకోసం త‌న భార్యామ‌ణి గౌరీఖాన్‌ ని నిర్మాత‌గా చేసి - ఎల్లో క‌ల‌ర్స్ బ్యాన‌ర్‌ ని క‌లుపుకుని.. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ ప‌తాకంపై జీరో చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్‌ తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంకోసం దాదాపు 150కోట్ల మేర బ‌డ్జెట్ ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇంత భారీ పెట్టుబ‌డి పెడుతున్నారు... పైగా ఎంచుకున్న క‌థాంశం ఎంతో వైవిధ్య‌మైన‌ది. ఇందులో షారూక్ ఓ మ‌రుగుజ్జు పాత్ర‌లో న‌టించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. మ‌రుగుజ్జు అన్న కాన్సెప్టు కొత్తేమీ కాక‌పోయినా ఈ చిత్రాన్ని ఎంతో యూనిక్ గా తీర్చిదిద్దుతున్నామ‌ని ఆనంద్ ఎల్‌.రాయ్ ఇదివ‌ర‌కూ తెలిపారు. క‌మ‌ల్ హాస‌న్ `విచిత్ర సోద‌రులు` (అపూర్వ సహోదరగళ్) చిత్రానికి ఈ సినిమాకి ఏ సంబంధం లేద‌ని రాయ్ తెలిపారు.

ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన జీరో పోస్ట‌ర్లు - టీజర్ సినిమాపై ఉత్కంఠ పెంచాయి. ఇందులో షారూక్ మ‌రుగుజ్జు పాత్ర ఆస‌క్తి రేకెత్తించింది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న క‌త్రిన కైఫ్‌ - అనుష్క శ‌ర్మ పోస్ట‌ర్లను మాత్రం యూనిట్ రిలీజ్ చేయ‌లేదు. తాజాగా ఆ ఇద్ద‌రి పోస్ట‌ర్ల‌నూ ఆవిష్క‌రించారు. ఈ పోస్ట‌ర్లు అభిమానుల సామాజిక మాధ్య‌మాల్లో దూసుకుపోతున్నాయి. ఈ దీపావ‌ళి కానుక‌గా జీరో ట్రైల‌ర్‌ ని ఈ శుక్ర‌వారం (న‌వంబ‌ర్ 2న‌) రిలీజ్ చేస్తున్నారు.

తాజా పోస్ట‌ర్ల‌లో మ‌రుగుజ్జు షారూక్‌ తో ఆ ఇద్ద‌రి రొమాన్స్ ఆక‌ట్టుకుంటోంది. ముఖ్యంగా మ‌రుగుజ్జుతో క‌త్రిన రొమాన్స్ ఆస‌క్తి పెంచుతోంది. క్యాట్ రెడ్ హాట్ డ్రెస్‌ లో త‌ళుక్కుమంది. ఇక అనుష్క శ‌ర్మ చాలా సాధాసీదాగా క‌నిపించినా షారూక్‌ తో ఓ చిలౌట్ మూవ్‌ మెంట్‌ లో క‌నిపించింది. కాన్సెప్టు ప‌రంగా ఆస‌క్తి పెంచుతోంది. అయితే 2018 మోస్ట్ అవైటెడ్ జాబితాలో ఈ సినిమా నిలుస్తుందా.. లేదా? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. ట్రైల‌ర్ చూశాక ఓ అంచ‌నాకి రావొచ్చు. అటుపై డిసెంబ‌ర్ లో రిలీజ్ వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.