Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: మళ్ళీ మళ్ళీ చూశా

By:  Tupaki Desk   |   27 Dec 2018 1:15 PM IST
ఫస్ట్ లుక్: మళ్ళీ మళ్ళీ చూశా
X
తెలుగులో స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్ల సినిమాలకంటే చిన్న సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ చిన్న సినిమాలలో ప్రతివారం కొత్త హీరోలు తెలుగు తెరపై తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటూ ఉంటారు. అదే కోవలో అనురాగ్ కొణిదెన 'మళ్ళీ మళ్ళీ చూశా' సినిమాతో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.

ఈ సినిమాలో శ్వేత అవస్తి.. కైరవి తక్కర్ హీరొయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సాయిదేవ రామన్ దర్శకుడు. కృషి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను కొణిదెన కోటేశ్వరరావు నిర్మిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో కొత్త కుర్రాడు సూటు బూటులో స్టైలిష్ గానే కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా నిర్మాత కోటేశ్వర రావు మాట్లాడుతూ షూటింగ్ పూర్తయిందని.. హైదరాబాద్ వైజాగ్ తో పాటుగా అరకులోని అందమైన లోకేషన్స్ లో చిత్రీకరణ జరిపామని తెలిపాడు. దర్శకుడు తమ చిత్రం ఒక అందమైన ప్రేమ కావ్యం అని నమ్మకంగా చెప్తున్నాడు. ఈ సినిమా టీజర్.. ట్రైలర్లు రిలీజ్ అయితే గానీ ఆడియన్స్ కు ఈ విషయంలో ఒక క్లారిటీ రాదు.

ఈటివి ప్రభాకర్.. టి.ఎన్.ఆర్.. మిర్చి కిరణ్.. అప్పాజీ.. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం శ్రవణ్ భరద్వాజ్.. సినిమాటోగ్రాఫర్ సతీష్ ముత్యాల