Begin typing your search above and press return to search.
పెళ్లికి ముందే గర్భవతి అయితే.. తండ్రి కూతుళ్ల సెన్సేషనల్ ఇంటర్వ్యూ!!
By: Tupaki Desk | 21 Jun 2021 10:00 PM ISTమీ అమ్మాయి ప్రేమలో పడింది.. తన ప్రియుడు మీకు నచ్చారా? మీ కూతురు పెళ్లికి ముందే గర్భవతి అయితే ఏం చేస్తారు? మీ అమ్మాయి తాగి అరిస్తే మీ స్పందన ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు ఏ తండ్రిని అయినా అడిగితే ఆయన మనోభావాలు ఎలా ఉంటాయి? ఎంపిక చేసిన సంస్కృతి నేపథ్యం నుంచి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఒక్కొక్కరి నుంచి ఒక్కోలా ఉంటుంది.
అయితే అల్ట్రా రిచ్ బాలీవుడ్ ఫాదర్ అనురాగ్ కశ్యప్ నుంచి ఆన్సర్లు అన్నీ చాలా జోవియల్ గా పరిణతితో కూడుకున్నవి అనడంలో సందేహమేం లేదు. ఫాదర్స్ డే సందర్భంగా ఆలియా కశ్యప్ తన యూట్యూబ్ ఛానెల్ లో ఆమె తండ్రి అనురాగ్ కశ్యప్ ని ఇంటర్వ్యూ చేశారు. వీడియోలో అభిమానులు పంపిన ప్రశ్నలను ఆలియా తన తండ్రిని అడిగారు. ``ఆలియా ప్రియుడు షేన్ గ్రెగోయిర్ గురించి కశ్యప్ ఏమనుకుంటున్నాడు?`` అన్న ప్రశ్నకు సమాధానంగా.. ``నాకు షేన్ అంటే ఇష్టం. మంచి స్నేహితుడిని ఎలా ఎంచుకోవాలో నా కూతురికి తెలుసు. అతను చాలా ఆధ్యాత్మికతతో చాలా ప్రశాంతంగా ఉంటాడు. అతనికి 40 మంది మగాళ్లలో లేని చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. క్లిష్ట పరిస్థితులలో అతడు గొప్పవాడిగా ఉంటాడు..`` అని అనురాగ్ అన్నారు.
అన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలకు అనురాగ్ సమాధానమిచ్చాడు. అనేక సందర్భాల్లో ఆలియా తాగినప్పుడు అనురాగ్ పై అరిచింది. తాగినప్పుడు తన కుమార్తె విషయంలో ఎలా స్పందిస్తారనే ప్రశ్నకు సమాధానమిది. ``మీరు చాలా చేసారు. ప్రతిసారీ పార్టీలో ఉన్నప్పుడు మీరు డయల్ చేసారు. మీరు అల్మరా లోపల కూర్చుని నాతో మాట్లాడారు. పార్టీలో ఉన్న మీ స్నేహితులందరికీ హాయ్ చెప్పి అందరితో మాట్లాడేలా చేసారు. మీరు ప్రతి ఒక్కరినీ గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ నుండి డైలాగ్స్ చెప్పేలా చేసారు`` అంటూ ఆలియా తెలిపారు. ``మీరు(గాళ్స్) తాగినప్పుడు మాట్లాడటం చాలా సరదాగా ఉంటుంది... కానీ ప్రతిసారీ మీరు అలా చేయరు అని అనురాగ్ అన్నారు.
ఆలియా ఒక చమత్కార ప్రశ్న అడిగారు. తన కుమార్తెకు సెక్స్ గురించి చెప్పాల్సి వస్తే.. ప్రతిదీ దాచుకోవాల్సిన అవసరం లేదని గతంతో పోలిస్తే ఇప్పుడు అంతా మారిందని అనురాగ్ అన్నారు. గతంలో సెక్స్ అనే పదం పలకడాన్ని కూడా నేరంగా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. శృంగారం అంటే శరీరానికి సంబంధించిన ఓ ఫీలింగ్. కానీ దాని వల్ల తలెత్తే పరిణామాల గురించి నేను వివరిస్తాను. మంచేంటే చెడేంటో తన కుమార్తెకు చెబుతానని అనురాగ్ అన్నారు.
పెళ్లికి ముందే గర్బం వస్తే ఏం చేస్తారు? అన్నదానికి.. తన నిర్ణయం ఏమిటో తెలుసుకుని దానిని గౌరవిస్తానని అనురాగ్ అన్నారు. కుమార్తెకు మద్దతుగా నిలుస్తాను.. కానీ దాని మూల్యాన్ని భరించాల్సింది నువ్వే`` అని కూడా అన్నారు. ఇలాంటి ఎన్నో గొప్ప విషయాలపై అనురాగ్ స్పందనలు అది కూడా తన కుమార్తె ముందు ఎంతో హుందాగా సాగాయి.