Begin typing your search above and press return to search.

రూటు మార్చిన అనుప‌మ‌.. ఇలాగైనా క‌లిసొచ్చేనా?

By:  Tupaki Desk   |   23 July 2022 8:32 AM GMT
రూటు మార్చిన అనుప‌మ‌.. ఇలాగైనా క‌లిసొచ్చేనా?
X
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు త‌మదైన న‌ట‌న‌తోనే కాదు గ్లామ‌ర్ షోతోనూ సంచ‌ల‌నాలు సృష్టించి స్టార్ హోదాను ద‌క్కించుకున్న వారు ఎంద‌రో ఉన్నారు. అందాలన్నీ వడ్డనకు పెడుతూ ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుంటున్న వారూ ఉన్నారు. అయితే అందాల ఆర‌బోత‌కు దూరంగా ఉండే హీరోయిన్లు మాత్రం చాలా అరుదుగా క‌నిపిస్తుంటారు. ఆ లిస్ట్ లో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుప‌మ పరమేశ్వరన్ ఒక‌రు.

మ‌ల‌యాళ 'ప్రేమమ్'తో సినీ కెరీర్ ను ప్రారంభించిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తెర‌కెక్కించిన 'అ ఆ' మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఇందులో ఆమె హీరోయిన్ కాక‌పోయినా.. నాగవల్లి పాత్ర‌లో ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఆ తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ కు జోడీగా 'శతమానం భవతి'లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన అనుప‌మ‌కు.. మ‌రిన్ని అవ‌కాశాలు త‌లుపు త‌ట్టాయి.

అందాలు ఆర‌బోయ‌క‌పోయినా.. క‌ర్లీ హెయిర్‌, క‌వ్వించే చూపులు, ఆక‌ట్టుకునే న‌వ్వుతో యూత్ లో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. కానీ, ఏం లాభాం..? అనుప‌మ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎద‌గ‌లేక‌పోయింది.

అందుకు కార‌ణం ఆమె చేసిన చిత్రాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌ట‌మే. ఈ క్ర‌మంలోనే అమ్మ‌డుకు ఆఫ‌ర్లు కూడా త‌గ్గిపోయాయి. కెరీర్ బాగా డౌన్ అయిపోయింది.

దాంతో అనుప‌మ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయింది. అంతేకాదు, అందాల ఆర‌బోత‌కు ఆమ‌డ దూరంలో ఉండే ఈ ముద్దుగుమ్మ.. రూటు మార్చి గ్లామ‌ర్ షోతో కుర్ర‌కారుకు నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తోంది. తాజాగా కూడా బ్లాక్ ఫ్లోర‌ల్ డ్రెస్‌లో వేరె లెవ‌ల్ లో అందాలు ఆర‌బోసి నెటిజ‌న్ల‌కు మైండ్ బ్లాక్ చేసింది.

ఇండస్ట్రీలో నిలబడాలంటే ఖచ్చితంగా క్లీవేజ్ షో చేయాల్సిందే అన్న‌ నిర్ణయానికి అనుప‌మ వ‌చ్చింది అన‌డానికి.. ఆమె లేటెస్ట్ ఫోటోలే నిద‌ర్శ‌నం అని అంటున్నారు. మ‌రి ఇలాగైనా అనుప‌మ కెరీర్ కు క‌లిసొస్తుందో..లేదో..చూడాలి. కాగా, అనుప‌మ చేతిలో ప్ర‌స్తుతం 'కార్తికేయ 2', '18 పేజెస్', 'బటర్ ఫ్లై' చిత్రాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాల‌పైనే అనుప‌మ త‌న ఆశ‌ల‌న్నీ పెట్టుకుంది.