Begin typing your search above and press return to search.

అందాల డోస్ పై అనుపమ ఫీలింగ్స్

By:  Tupaki Desk   |   13 Nov 2017 1:16 PM GMT
అందాల డోస్ పై అనుపమ ఫీలింగ్స్
X
ఓ హీరోయిన్ కు స్టార్ స్టేటస్ రావాలంటే చాలానే క్వాలిటీస్ ఉండాలి. ఇందులో ఎక్స్ పోజింగ్ చాలా ముఖ్యం అని టాలీవుడ్ జనాలు తెగ నమ్ముతారు. ముఖ్యంగా బీ సీ సెంటర్ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలంటే.. అందాల డోస్ తప్పనిసరి.

నిత్యామీనన్ లాంటి కొందరు హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ లేకుండానే బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నా.. స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోలేకపోయారు. కానీ ఇప్పుడు టైం మారుతోంది. మలయాళీ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ .. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. అయినా సరే ఇప్పటివరకూ చిన్నపాటి ఎక్స్ పోజింగ్ కూడా చేయకపోవడం విశేషం. స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ కు కేవలం కొన్ని అంగుళాల దూరంలోనే ఉంది అనుపమ. ఇదే విషయాన్ని ఈ భామ అభిమానులు.. సోషల్ మీడియాలో తెగ చర్చించేసుకుంటున్నారు.

ఎక్స్ పోజింగ్ చేయకుండానే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న తమ అభిమాన తార గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు. మరి ప్రస్తుతం ఉన్న తన సిద్ధాంతాలను ఇలాగే కంటిన్యూ చేస్తుందో.. లేక ఫ్యూచర్ లో కమర్షియల్ హీరోయిన్ ట్యాగ్ కోసం తన పద్ధతులు మార్చుకుంటుందో చూడాలి. మరో ముద్దుగుమ్మ కీర్తి సురేష్ కూడా ఇదే రూట్ లో ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.