Begin typing your search above and press return to search.

నయన్‌, నిత్య.. నెక్స్ట్ ఈ సుందరేనా?

By:  Tupaki Desk   |   11 Sep 2015 5:30 PM GMT
నయన్‌, నిత్య.. నెక్స్ట్  ఈ సుందరేనా?
X
ఇప్పుడు టాలీవుడ్ అంత‌టా కేర‌ళ కుట్టి అనుపమ్ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పేరు మారు మ్రోగిపోతుంది. కేవ‌లం ఫ‌లానా సినిమాలో ఎంపికైంద‌న్న ఒక్క వార్త అమ్మ‌డికి బోల్డెంత ప్ర‌చారాన్ని తెచ్చిపెట్టింది. ప్రేమ‌మ్ సినిమాతో మ‌ల‌యాళ ఇండ‌స్ర్టీకి అడుగు పెట్టిన ఈ భామ తొలి సినిమాతో భారీ విజ‌యాన్ని అందుకుంది. రొమాంటిక్ ల‌వ్ స్టోరీ తో తెర‌కెక్కిన చిత్రం ఇప్పుడు తెలుగులో కూడా అదే పేరుతో నాగ చైత‌న్య హీరోగా రీమేక్ అవుతుంది. ఇందులోనూ ఈ భామ మెయిన్ లీడ్ కు ఎంపికైంది. హారిక‌-హాసిని బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతోంది.

తాజాగా నితిన్ - త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రంలో కూడా సొగ‌స‌రి ఎంపికైంది. తెలుగులో ఆరంభ‌మే రెండు పెద్ద అవ‌కాశాల‌తో ఈ 19 ఏళ్ల సుంద‌రి అంద‌రి దృష్టిలో ప‌డింది. ఈ రెండు సినిమాలు విజ‌యం అందుకోవ‌డంలో ఎలాంటి సందేహం లేదు. స‌మంత అరంగేట్రం కూడా టాలీవుడ్ లో ఇలాగే జ‌రిగింది. రొమాంటిక్ ల‌వ్ స్టోరీతో తెర‌కెక్కిన ఏమాయ చేసావే సినిమా అప్ప‌ట్లో పెద్ద హిట్ట‌యింది. ఈ హిట్ తోనే మాతృభాష త‌మిళ్ లో కూడా అవ‌కాశాలు అందుకుంది. త‌ర్వాత పెద్ద హీరోయిన్ అయిపోయింది. మ‌ళ్లీ ఇప్పుడు భాష వేరైన ఆ సంద‌ర్భాన్ని అనుప‌మ్ గుర్తు చేసింది. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ కు మ‌రో జెస్సీ వ‌చ్చింద‌నిపిస్తోంది.

మ‌ల‌యాళ బ్యూటీస్‌ లో న‌యన‌తార‌, నిత్యామీన‌న్ టాప్‌ స్టాట్ హీరోయిన్ లుగా వెలిగిపోయారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అంత రేంజులో పాపులారిటీ సంపాదించిన వేరొక భామ లేరు. న‌వ‌త‌రం నాయిక‌ల్లో మ‌ల్లూ బ్యూటీలు ఇలా వ‌చ్చి అలా వెళుతున్నారు. ఇప్పుడు ఈ భామ ఆ బ్లాంక్ స్పేస్‌ని ఫిల్ చేస్తుందేమో చూడాలి.