Begin typing your search above and press return to search.

అ..ఆ.. భామ ఖాతాలో మరో క్రేజీ మూవీ

By:  Tupaki Desk   |   26 Jun 2016 4:43 AM GMT
అ..ఆ.. భామ ఖాతాలో మరో క్రేజీ మూవీ
X
త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అ..ఆ.. చిత్రం ద్వారా ప్రతీ ఒక్కరికీ క్రెడిట్ వచ్చింది. స్టార్ వాల్యూ లేకపోయినా అంతకు మించిన పవర్ తన డైలాగ్స్ ఉందనే డైరెక్టర్ త్రివిక్రమ్ స్టామినా ఇండస్ట్రీకి మరోసారి ప్రూవ్ అయింది. హీరో నితిన్ ని స్టార్ స్టేటస్ కు మరింత చేరువ చేసిందని చెప్పాలి. హీరోయిన్ సమంతకు అ..ఆ.. చాలా కీలకం. గ్లామర్ డోస్ తగ్గిందనే కామెంట్స్ కి ఈ సినిమాతో చెక్ పెట్టింది. ఇక మలయాళీ భామ అనుపమా పరమేశ్వరన్ ట్యాలెంట్ ఏంటో.. టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలియచెప్పిందీ సినిమా.

టీం అందరిలోకి అనుపమకే అ..ఆ.. సక్సెస్ ఎక్కువగా ఉపయోగపడింది. అ..ఆ.. చేస్తున్నపుడే ప్రేమమ్ తెలుగు రీమేక్ ఈ మలయాళ సోయగం చేతిలో ఉండగా.. ఆ తర్వాత ఆఫర్లు క్యూ కట్టేశాయి. ఇప్పటికే శేఖర్ కమ్ములతో చేయబోతున్న సినిమాకి హీరోయిన్ గా దిల్ రాజు ఈమెను తీసుకున్నాడు. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ కూడా ఈమె చేతిలోనే పెట్టాడీ నిర్మాత.

తన బ్యానర్ లో శర్వానంద్ తో తీయబోతున్న శతమానం భవతిలో కూడా అనుపమా పరమేశ్వరన్ నే ఫైనల్ చేశాడు దిల్ రాజు. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించనుండగా.. ఈ మూవీలో శర్వాకి లీడ్ హీరోయిన్ గా నటించనుంది అనుపమా పరమేశ్వరన్. ఈ క్రేజీ ప్రాజెక్టుల క్యూ చూస్తుంటే.. ఈ కేరళ భామ టాలీవుడ్ లో తిష్ట వేసేసినట్లే కనిపిస్తోంది.