Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: తెలుగమ్మాయ్ కాదా! నమ్మేదెలా!

By:  Tupaki Desk   |   30 Dec 2016 1:30 AM GMT
ఫోటో స్టోరి: తెలుగమ్మాయ్ కాదా! నమ్మేదెలా!
X
మలయాళీ భామ అనుపమా పరమేశ్వరన్ తెలుగులో వరుస అవకాశాలు దక్కించేసుకుంటోంది. చకచకా సినిమాలు చేసేసుకుంటూ మెప్పించేస్తోంది. మల్లూవుడ్ ప్రేమమ్ తో పాటు.. తెలుగు ప్రేమమ్ లోను అలరించిన ఈ బ్యూటీ.. మధ్యలో త్రివిక్రమ్ మూవీ అ..ఆ.. లో కూడా కనిపించింది. తెలుగులో నటించిన రెండు సినిమాల్లోనూ పల్లెటూరి పిల్లగా కనిపించిన ఈ మలయాళీ వయ్యారి.. ఇప్పుడు శతమానం భవతిలో శర్వానంద్ కి హీరోయిన్ నటిస్తోంది.

పెద్ద చిత్రాల మధ్య వస్తుండడంతో ఇంకా శతమానం భవతిపై హైప్ క్రియేట్ కావడం లేదు. దీంతో ఇప్పడు ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. కొత్త కొత్త పోస్టర్లతో సందడి చేస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన ఓ స్టిల్ లో సంక్రాంతి ముగ్గులుపెడుతున్న అనుపమా పరమేశ్వరన్ ను చూస్తే.. అసలు ఈ భామ తెలుగమ్మాయి కాదు అంటే నమ్మడం అసాధ్యం. అంతలా తెలుగుదనాన్ని పలికించేస్తోంది అనుపమ. అన్నిటికంటే ముఖ్యంగా అమ్మడి పెదాలపై కనిపిస్తున్న ఆ నవ్వును చూస్తే చాలు.. చాలా మంది మతులు పోగొట్టేసుకుంటున్నారు.

ఇప్పటికే శతమానం భవతికి సెన్సార్ కూడా కంప్లీట్ చేసేసుకుని యూ సర్టిఫికేట్ సంపాదించేసింది. కంప్లీట్ ఫ్యామిలీ మూవీ కావడంతో.. సైలెంట్ గానే హిట్ కొట్టేస్తుందని నిర్మాత దిల్ రాజు ఆశలు పెట్టుకున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/