Begin typing your search above and press return to search.

చరణ్ కి పల్లెటూరి పాప ఫైనల్??

By:  Tupaki Desk   |   17 Dec 2016 9:20 AM GMT
చరణ్ కి పల్లెటూరి పాప ఫైనల్??
X
రామ్ చరణ్ ధృవ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే.. కొత్త సినిమా సంగతులు కూడా చెప్పేశాడు. మెగాస్టార్ మూవీ ఖైదీ నెంబర్ 150 కోసం సంక్రాంతి వరకూ టైం కేటాయించిన చెర్రీ.. ఫిబ్రవరి ప్రారంభంలో సుకుమార్ తో సినిమా మొదలుపెడతానని అన్నాడు. ఇది గ్రామీణ వాతావరణంలో నడిచే అందమైన ప్రేమకథ కూడా అని చెప్పాడు కానీ.. హీరోయిన్ విషయం మాత్రం చెప్పలేదు.

పక్కా పల్లెటూరి అమ్మాయి లుక్స్ ఉన్న హీరోయిన్ కావాల్సి ఉండడంతో.. ఇప్పటికే పలువురిని స్క్రీన్ టెస్ట్ చేసిన దర్శకుడు సుకుమార్ సంతృప్తి చెందలేదు. చెర్రీతో రొమాన్స్ చేసే భామ అంటూ రాశి ఖన్నా.. సమంతల పేర్లు ఎక్కువగానే వినిపించాయి. ఇప్పుడు ఆ అవకాశం మలయాళీ కుర్ర బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ కి దక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుపమకు ఈ ఆఫర్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారట కానీ.. ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు.

ఇప్పటికే త్రివిక్రమ్ మూవీ అ..ఆ.., నాగ చైతన్యతో ప్రేమమ్ సినిమాల్లో పల్లెటూరి భామగా అదరగొట్టే యాక్షన్ చేసింది అనుపమ. ఈ రోల్ కు ఇప్పటి జనరేషన్ యంగ్ బ్యూటీస్ లో అనుపమకు మించిన ఆప్షన్ లేదని ఫిక్స్ అయిపోయిన సుకుమార్.. ఇదే విషయాన్ని చెర్రీకి చెప్పడం.. ఓకే అనిపించేసుకున్నాడట కూడా. టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి చేరేందుకు అనుమమా పరమేశ్వరన్ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కినట్లే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/