Begin typing your search above and press return to search.

నిఖిల్ తో మరోసారి రొమాన్స్ చేస్తున్న మలయాళ బ్యూటీ..!

By:  Tupaki Desk   |   30 Aug 2021 4:39 PM GMT
నిఖిల్ తో మరోసారి రొమాన్స్ చేస్తున్న మలయాళ బ్యూటీ..!
X
యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో ''కార్తికేయ 2'' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది వీరి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని మేకర్స్ ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు.

కృష్ణాష్టమి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ 'కార్తికేయ 2' చిత్ర యూనిట్ ఓ వీడియో హీరోయిన్ ను అనౌన్స్ చేశారు. ఇందులో నిఖిల్ సరసన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వెల్లడించారు. హీరో నిఖిల్ వీడియో తీస్తుండగా.. డైరెక్టర్ చందు తన చేతులతో అనుపమ ను రివీల్ చేస్తున్నట్లు ఫన్నీగా చూపించారు. నిఖిల్ తో వరుసగా రెండోసారి ప్రేమమ్ బ్యూటీ రొమాన్స్ చేయనుంది.

ఇప్పటికే పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న '18 పేజెస్' చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలతో హిట్స్ అందుకుని, నిఖిల్ - అనుపమ జోడీ సక్సెస్ ఫుల్ పెయిర్ అనిపించుకుంటుందేమో చూడాలి. కాగా, 'కార్తికేయ 2' చిత్రాన్ని తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారని సమాచారం.

​ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ - వివేక్ కూచిభోట్ల‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ''కార్తికేయ 2'' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.