Begin typing your search above and press return to search.

అనుపమ అప్పుడే భారీ డిమాండ్స్

By:  Tupaki Desk   |   9 Jun 2018 2:19 PM IST
అనుపమ అప్పుడే భారీ డిమాండ్స్
X
స్టార్ హీరో హీరోయిన్స్ తో ఒక సినిమా చేయాలంటే నిర్మాతలు పడే కష్టాలు అన్ని ఇన్ని కావు. ఎవరు సరిగ్గా ఉన్నా లేకపోయినా ప్రొడక్షన్ టీమ్ మాత్రం చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. సినిమా రిజల్ట్ సంగతి తరువాత గాని ముందు హీరో హీరోయిన్స్ సౌఖ్యంగా ఉన్నారా లేదా అనేది సినిమా వాళ్లకు చాలా ముఖ్యం. షూటింగ్ సరిగ్గా సాగాలంటే వారికి అన్ని వసతులు ఉండాలి. అయితే అప్పుడపుడు కార్ వ్యాన్ విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి.

సింగిల్ డోర్ డబుల్ డోర్ అంటూ తారలు ఇబ్బంది పెడుతుంటారు. నిర్మాతలకు అది పెద్ద తలపోటు. అందుకే చాలా వరకు స్టార్ హీరో హీరోయిన్స్ వారి సొంతంగా కార్ వ్యాన్ లను మెయింటైన్ చేస్తుంటారు. ఇకపోతే రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్ - దిల్ రాజు ప్రొడక్షన్ టీమ్ కు మధ్య అదే అదే తరహాలో ఇష్యూ వచ్చిందట. వెంటనే తనకు సొంతంగా ఒక కార్ వ్యాన్ అండ్ కాస్ట్యూమర్ ని సెట్ చేసుకుంటా అని చెప్పేసిందట.

దిల్ రాజు ప్రొడక్షన్ లో రామ్ హీరోగా త్రినాథ రావ్ నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల షూటింగ్ లో అమ్మడికి సెట్ చేసిన కార్ వ్యాన్ ఏ మాత్రం నచ్చలేదట దీంతో వెంటనే సిబ్బందిపై అరిచేసిందట. కాస్ట్యూమర్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక చివరికి దిల్ రాజు కలుగజేసుకొని అమ్మడి ఆగ్రాహాన్ని తగ్గించినట్లు టాక్. ఇంకా ఒక పెద్ద స్టార్ అవ్వకమునుపే ఇన్నేసి డిమాండ్స్ చేస్తుందా అని మనకు అనిపించకమానదు.