Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: స్మైలీ `ప్రేమ‌మ్` బ్యూటీస్

By:  Tupaki Desk   |   28 April 2021 9:30 AM GMT
ఫోటో స్టోరి: స్మైలీ `ప్రేమ‌మ్` బ్యూటీస్
X
ఆ ఇద్ద‌రూ ప్రేమ‌మ్ చిత్రంతో తెలుగు వారికి సుప‌రిచితం అయ్యారు. ఆ త‌ర్వాత కెరీర్ ప‌రంగా చ‌క‌చ‌కా సినిమాలు చేసుకుంటూ ఎదిగారు. త‌న‌దైన అందం అభిన‌యంతో ఆక‌ట్టుకున్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ..త‌న‌వైన డ్యాన్సులు గొప్ప అభిన‌యంతో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న సాయి ప‌ల్ల‌వి స్నేహం గురించే ఇదంతా.

ఆ ఇద్ద‌రు స్నేహితులు ఓచోట కలిస్తే సంద‌డే సంద‌డి. అందుకు ఇదిగో ఈ ఫోటోనే ప్రూఫ్‌. అలా క్యూట్ గా స్మైలిస్తూ ప్రేమ‌మ్ బ్యూటీస్ ఓచోట క‌నిపించ‌డం ఎంతో ముద్దొచ్చేస్తోందంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అనుప‌మ కెరీర్ ఇటీవ‌ల కొంత స్పీడ్ త‌గ్గినా అంత‌లోనే దిల్ రాజు బ్యాన‌ర్ లో వ‌రుస సినిమాల్లో న‌టించేందుకు సంత‌కాలు చేయ‌డం విశేషం.

మ‌రోవైపు సాయి ప‌ల్ల‌వి మాత్రం కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక లేకుండా ఉంది. ఈ బ్యూటీ న‌టించిన‌ ల‌వ్ స్టోరి.. విరాఠ‌ప‌ర్వం రిలీజ్ ల‌కు రెడీగా ఉన్నాయి. త‌న‌కోస‌మే క‌థలు రాసేవాళ్లు.. సినిమాలు తీసేవాళ్లు ఉన్నారంటే త‌న రేంజేంటో అర్థం చేసుకోవ‌చ్చు. అందంతో కంటే ప్ర‌తిభ‌తో ఎదిగిన బ్యూటీగా సాయిప‌ల్ల‌వి ఇండ‌స్ట్రీలో పాపుల‌ర‌య్యారు. ఇంత‌కీ ఆ ఇద్ద‌రూ ఇలా క‌ల‌వడానికి కార‌ణ‌మేమిటి? క‌లిసి న‌టిస్తున్నారా? ప్రేమమ్ సీక్వెల్ ఐడియా ఎవ‌రైనా ఇచ్చారా..!? అస‌లేం జ‌రుగుతోంది? తాజాగా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసిన ఈ ఫోటోలో ఒక‌రు బ్లాక్ లో క‌నిపిస్తే మ‌రొక‌రు వైట్ లో క‌నిపిస్తుండ‌డం ఆసక్తిక‌రం.