Begin typing your search above and press return to search.

ఫొటోస్టోరీ: వీళ్లు త‌ల్లీకూతుళ్లే... న‌మ్మండి!

By:  Tupaki Desk   |   8 Oct 2016 7:30 AM GMT
ఫొటోస్టోరీ: వీళ్లు త‌ల్లీకూతుళ్లే... న‌మ్మండి!
X
అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌... `అఆ`తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన మ‌ల‌యాళ ముద్దుగుమ్మ. నిన్న‌నే విడుద‌లైన `ప్రేమ‌మ్‌`లో సుమ పాత్ర‌తోనూ అల‌రిస్తోంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మ‌ల‌యాళంలో తెర‌కెక్కిన `ప్రేమ‌మ్‌`తోనే ఇంట్ర‌డ్యూస్ అయింది. ఆ చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డంతో అనుప‌మ పేరు మార్మోగిపోయింది. దాంతో ఆమెకి త‌మిళం - తెలుగు ప‌రిశ్ర‌మల నుంచీ అవ‌కాశాలు వెల్లువెత్తాయి. ప్ర‌స్తుతం `శ‌త‌మానం భ‌వ‌తీ`లో శ‌ర్వానంద్‌ తో క‌లిసి న‌టిస్తోంది.

తెలుగు - త‌మిళం - మ‌ల‌యాళం... మూడు భాష‌ల్లోనూ న‌టిస్తూ తీరిక లేకుండా గ‌డుపుతున్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కి ఈమ‌ధ్య కాస్త ఖాళీ దొరికిన‌ట్టుంది. అందుకే త‌ల్లితో క‌లిసి బీచ్‌ కి వెళ్లి స‌ముద్ర‌పు అందాల్ని ఆస్వాదిస్తోంది. ప‌నిలో ప‌నిగా అమ్మ‌తో క‌లిసి సెల్ఫీ కూడా తీసుకొని ట్విట్ట‌ర్‌ లో పెట్టింది. అందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌ల్లిని చూసిన‌వాళ్లంతా అవాక్క‌వుతున్నారు. అచ్చం అనుప‌మ‌లాగే క‌నిపిస్తోందామె. అనుప‌మ‌కి అమ్మగా కాకుండా ఓ అక్క‌లా క‌నిపిస్తోంది. ఈ ఫొటోని ట్విట్ట‌ర్‌ లో చూస్తున్న‌వాళ్లంతా `మీ అమ్మ నీ తోబుట్టువులా ఉంది` అంటూ కామెంట్ చేస్తున్నారు. మ‌న‌కూ అలాగే అనిపిస్తోంది క‌దూ! కానీ ఈమె అనుప‌మ అమ్మే ... న‌మ్మండి!