Begin typing your search above and press return to search.

అనుపమ మాటలు కూడా అందమే

By:  Tupaki Desk   |   14 Oct 2017 7:04 AM GMT
అనుపమ మాటలు కూడా అందమే
X
మలయాళీ ముద్దుగుమ్మల అదృష్టం ఏమిటో గాని తెలుగులో రెండు మూడు సినిమాలకే చాలా పాపులర్ అయిపోతారు. కొత్తగా క్యూట్ గా ఉండడంతో తెలుగు అభిమానులకు తొందరగా నచ్చేస్తారు. అయితే నార్త్ బామలు తెలుగులో ఎన్ని సినిమాలను తీసినా తెలుగులో అంతగా మాట్లాడలేరు. కానీ మలయాళీ బామలు మొదటి సినిమా నుంచే తెలుగును గట్టిగా నేర్చేసుకుంటున్నారు. రీసెంట్ మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడిన తెలుగును చూస్తే ఎవ్వరైనా ఆమెకు అభిమానులు కావాల్సిందే.

నిన్న జరిగిన 'ఉన్నది ఒక్కటే జిందగీ' ఆడియో వేడుకలో అనుపమ మాటలకు అందరు ఫ్యాన్స్ అయిపోయారు. అసలే అమ్మడు చాలా క్యూట్. అందులోను తెలుగు మాట్లాడుతుంటే ఇంకా క్యూట్ గా అనిపించింది. ముఖ్యంగా ఆమె సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇప్పటివరకు తీసినా సినిమాలకంటే ఈ సినిమా నా జీవితంలో చాలా బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకొచ్చింది. ఇక దర్శకుడు కిశోర్ తిరుమలను అయితే ఆకాశానికి ఎత్తేసింది. అయన రాసిన కథలోని మాటలు చాలా బావున్నాయని. ఒక దర్శకుడిగానే కాకుండా మంచి వ్యక్తిగా కనిపించాడని అనుపమ వివరించింది. సినిమాలో మహా అనే క్యారెక్టర్ తన లైఫ్ లో ది బెస్ట్ అని తెలుపుతూ.. సహనటి లావణ్య కూడా చాలా బాగా నటించిందని తెలిపింది.

అదే విధంగా కెమెరామెన్ కూడా చాలా హెల్ప్ చేశారని సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు చాలా ఎనర్జిటిక్ గా కనిపించారని వివరించింది. ఇక హీరో రామ్ ఎనర్జీ సినిమాలో మాములుగా లేదని తెలుపుతూ ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని అనుపమ క్లియ్యర్ గా చెప్పింది. అలాగే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సూపర్బ్ అంటూ.. సినిమాకు పనిచేసిన లైట్ మ్యాన్ వరకు అందరిని అనుపమ అందంగా పొగిడేసింది.