Begin typing your search above and press return to search.

చందూ మొండేటి.. మంచి టేస్టున్నోడు

By:  Tupaki Desk   |   4 Oct 2016 11:30 AM GMT
చందూ మొండేటి.. మంచి టేస్టున్నోడు
X
తెలుగు సినిమాలతో బాగా కనెక్టయిపోయానంటోంది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. మలయాళ బ్లాక్ బస్టర్ ‘ప్రేమమ్’తో కథానాయికగా పరిచయమయ్యాక.. ‘అఆ’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టి మంచి పేరే సంపాదించింది అనుపమ. దీని తర్వాత ‘ప్రేమమ్’ తెలుగు వెర్షన్లోనూ కీలక పాత్ర చేసింది. ‘శతమానం భవతి’లో శర్వానంద్ సరసన జత కడుతోంది. ‘ప్రేమమ్’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన అనుపమ.. ఇక్కడి సినిమా వాతావరణం.. ఇక్కడి ఆర్టిస్టులు.. టెక్నీషియన్లు చాలా బాగా నచ్చినట్లు వెల్లడించింది. ‘ప్రేమమ్’ సినిమా దర్శకుడు చందూ మొండేటి.. హీరో నాగచైతన్యల గురించి.. ఈ చిత్ర విశేషాల గురించి ఆమె ఏమందంటే..

చందూ మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్. పెద్దగా మాట్లాడడు. ప్రతి సీన్ అర్థమయ్యేలా చెబుతాడు. కొన్ని సన్నివేశాలు షూట్ చేసేటపుడు ఆయన టాలెంట్ ఏంటో అర్థమయింది. ఆయన నేచర్ అందరికీ నచ్చుతుంది. మంచి టేస్టున్న వ్యక్తి. చందూతో పని చేయడం చాలా సంతోషం. చైతన్య చాలా కూల్ గా ఉంటాడు. తనతో పని చేయడం కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. చాలా ఒద్దికగా ఉంటాడు. ప్రతి విషయం వివరిస్తాడు. మంచి సలహాలు ఇస్తాడు. ఈజీ గోయింగ్ పర్సన్. ‘ప్రేమమ్’లో అతను చాలా బాగా నటించాడు. ముఖ్యంగా వయసు పెరిగాక కనిపించే పాత్ర చైతూ నటన చాలా బాగుంటుంది. నా పాత్ర విషయానికి వస్తే.. దాదాపుగా ఒరిజినల్లో ఉన్నట్లే ఉంటుంది. తెలుగులో కూడా చాలా బాగా వచ్చింది నా క్యారెక్టర్. ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకుంటానని కాన్ఫిడెంటుగా ఉన్నా’’ అని అనుపమ చెప్పింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/