Begin typing your search above and press return to search.

ర‌వితేజ ప‌క్క‌న ఆ లేత పిల్లా?!

By:  Tupaki Desk   |   26 Sep 2015 5:05 AM GMT
ర‌వితేజ ప‌క్క‌న ఆ లేత పిల్లా?!
X
హిట్టు సినిమా ఏ భాష‌లో వ‌చ్చినా స‌రే... ప్ర‌పంచం మొత్తానికి చేరువైపోతుందేమో. మ‌ల‌యాళం `ప్రేమ‌మ్‌` మ‌రోమారు ఆ విష‌యాన్ని రుజువు చేసింది. అస‌లు మ‌ల‌యాళం సినిమాకీ, మ‌న‌కీ ఏంటండీ సంబంధం? ఆ భాషయినా అర్థ‌మ‌వుతుందా? క‌న్న‌డ‌ - త‌మిళంతోనైనా ప‌రిచ‌య‌ముంది కానీ మ‌ల‌యాళం మాత్రం మ‌న‌లో చాలా త‌క్కువ‌మందికి తెలుసు. మ‌హా అంటే స్టోరీ సిట్టింగుల‌క‌నో, మ్యూజిక్ సిట్టింగ్‌ ల‌క‌నో కేర‌ళ వెళుతుంటారు. ఇక గోదావ‌రి కంటే ఎక్కువ గ్రీన‌రీని చూపించాల‌నుకొన్న‌ప్పుడు ద‌ర్శ‌కులు అక్క‌డికి వెళ్లి షూటింగ్ చేసుకొస్తుంటారు. అంత‌కుమించి మ‌ల‌యాళ సినిమాల‌తో మ‌న‌కి సంబంధం త‌క్కువ‌. కానీ అక్క‌డ ప్రేమ‌మ్ అనే సినిమా సూప‌ర్‌ హిట్ట‌యింద‌ని తెలుసుకొని... ఎంత‌మంది చూశార‌ని! మ‌న ఇండ‌స్ట్రీలో ప్రేమ‌మ్ గురించి ఎవ‌ర్న‌డిగినా గంట‌ల‌కొద్దీ మాట్లాడేసేలా ఉన్నారు. హీరోలు - హీరోయిన్లు - డైరెక్ట‌ర్లు - ప్రొడ్యూస‌ర్లు... ఇలా అంద‌రూ ఆ సినిమాని చూసేశారు. ఆ సినిమా పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేయ‌డంతో వెంట‌నే నాగ‌చైత‌న్య రీమేక్ చేయాల‌ని డిసైడ్ అయ్యారు. అందులో మ‌రికొద్దిమందికి అందులోని ఆర్టిస్టులు - దాని వెన‌క టెక్నీషియ‌న్లు కూడా న‌చ్చేశారు. దీంతో వాళ్ల‌నీ తెలుగుకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు షురూ చేశారు.

త్రివిక్ర‌మ్ తీస్తున్న `అ ఆ`తో ప్రేమ‌మ్ హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మ‌వుతోంది. అంతే కాదు.. మ‌రో ఇద్ద‌రు ముగ్గురు యంగ్ హీరోల ప‌క్క‌న కూడా ఆమె న‌టించ‌బోతోంద‌ని తెలుస్తోంది. ప్రొడ్యూస‌ర్లంతా ఇప్పుడు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌. అనుప‌మ‌కి మ‌ల‌యాళంలో తొలి సినిమానే `ప్రేమ‌మ్`. మొట్ట‌మొద‌ట చేసిన సినిమాతోనే అంత గుర్తింపు రావ‌డం విశేష‌మే. అయితే ఇప్పుడు అనుప‌మ‌లాంటి లేత పిల్ల‌ని తీసుకొచ్చి ర‌వితేజకి జోడీ చూపించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా `ఓ మై ఫ్రెండ్` ఫేమ్ వేణుశ్రీరామ్ ఓ చిత్రం తెర‌కెక్కించ‌బోతున్నాడు. దిల్‌రాజు దానికి నిర్మాత‌. `ఎవ‌డో ఒక‌డు` పేరుతో ఆ సినిమా తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలుస్తోంది. క‌థ రీత్యా అనుప‌మ అయితేనే బాగుంటుంద‌ని యూనిట్ భావిస్తున్న‌ట్టు తెలిసింది. మ‌రి అనుప‌మ సీనియ‌ర్ హీరో అయిన ర‌వితేజ‌ని యాక్సెప్ట్ చేస్తుందా అనేది చూడాలి.