Begin typing your search above and press return to search.

`18 పేజెస్` లో `అఆ` లే రాస్తోందా ఏమిటీ?

By:  Tupaki Desk   |   11 Dec 2020 12:55 PM IST
`18 పేజెస్` లో `అఆ` లే రాస్తోందా ఏమిటీ?
X
అందాల‌ అనుపమ పరమేశ్వరన్ పాఠశాలకు వెళుతోంది. అది కూడా కిండ‌ర్ గార్డెన్ కు. పైగా అఆ లు దిద్దుతోంది. అ- అమ్మ‌.. ఆ - ఆవు.. ఇ-ఇల్లు అంటూ క్యూట్ బాల్యంలోకి తీసుకెళుతోంది అనుప‌మ‌.

ఇదిగో ఈ పుస్త‌కంలో అ..ఆ లు చూస్తున్నారుగా. ఎంత చక్క‌గా దిద్దుతోందో క‌దూ. క్యూట్ అనుప‌మ తొలిచిత్రం `ప్రేమమ్`‌లో పాఠశాల విద్యార్థినిగా కనిపించింది. అప్పుడు ఆ క్యూటీ రూపానికి మైమ‌రిపించే నటనకు మ‌న‌మంతా ఫిదా అయిపోయాం. ఇప్పుడు మ‌రోసారి అదే ఫీట్ వే‌స్తూ పాత జ్ఞాప‌కాల్లోకి దించేసింది అనుప‌మ‌.

క్యూటీ ఇప్పుడు తెలుగులో ‘అ..ఆ’లు రాయడం మొదలుపెట్టింది. త్రివిక్రమ్ చిత్రం ‘అఆ’ లో ఆమె పాత్రతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. కేవ‌లం తాను తెలుగు రాయడం నేర్చుకుంటున్న కాపీ రైటింగ్ పుస్తకం ఫోటోని చూపించింది అంతే. ఏడెనిమిదేళ్లుగా టాలీవుడ్ లోనే కెరీర్ వెతుక్కుంటూ ఉంది కాబ‌ట్టి అనుపమ తెలుగులో మాట్లాడగలదు. కానీ రాయ‌డం రాదు. ప్ర‌స్తుతం తెలుగు రాయ‌డం కూడా నేర్చేసుకుంటోంద‌ట‌. థాంక్యూ గోపీ గారు అంటూ త‌న గురువుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

టాలీవుడ్ లో కెరీర్ ప‌రంగా ఎదిగిన చాలా మంది క‌థానాయిక‌లు తెలుగు నేర్చుకున్నారు. మ‌ల్లూ భామ‌లే అయినా నిత్యామీన‌న్.. నివేద థామ‌స్ తెలుగు భాష‌ను ఎంతో క్లారిటీగా ముద్దుగా మాట్లాడేస్తుంటారు. కీర్తి సురేష్‌.. అమ‌లాపాల్ లాంటి భామ‌లు తెలుగును చ‌క్క‌గా మాట్లాడే ప్ర‌య‌త్నం చేశారు. ముంబై భామ అయినా త‌మ‌న్నా అద‌ర‌గొట్టేస్తుంది. ఇప్పుడు మాట్లాడ‌డ‌మే కాదు రాయ‌డంలోనూ అద‌ర‌గొట్టేయాల‌న్న ప్లాన్ తో ఉంది అనుప‌మ‌. ఈ భామ ప్ర‌స్తుతం నిఖిల్ స‌ర‌స‌న `18 పేజెస్` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో ఓ చిత్రంలోనూ న‌టిస్తోంది.