Begin typing your search above and press return to search.

డబ్బింగ్ ఇంకా బాగా చెప్పాలని..

By:  Tupaki Desk   |   9 Sept 2017 11:54 AM
డబ్బింగ్ ఇంకా బాగా చెప్పాలని..
X
ప్రస్తుత రోజుల్లో టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కన్నా పరభాషా హీరోయిన్స్ కె ఎక్కువ డిమాండ్ ఉంది. మన దర్శక నిర్మాతలు కూడా పక్క ఇండస్ట్రీల నుంచే హీరోయిన్స్ ని వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా మలయాళం ముద్దుగుమ్మలనైతే బాష రాకున్నా ఏరికోరి మరీ తీసుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో ఆ భామలు సూపర్ హిట్స్ ను అందించి స్టార్ హీరోలను సైతం ఆకర్షిస్తున్నారు.

అటువంటి హీరోయిన్స్ లలో ఒకరిగా చేరిపోయింది అనుపమ పరమేశ్వరన్. అయితే ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించిన ఈ భామ ఇంకా నటనలో అందరిని ఆకట్టుకునేలా తెలుగు బాషా నేర్చుకుంటుందట. ప్రస్తుతం అమ్మడు రామ్ హీరోగా తెరకెక్కుతున్న 'ఉన్నది ఒకటే జిందగీ' అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోయేలోపు తెలుగు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలని డిసైడ్ అయ్యిందట. ఎందుకంటే సినిమాలో ఎక్కువగా ఎమోషన్స్ తో కూడుకున్న సీన్స్ ఉన్నాయట. దీంతో తాను చెబితేనే ఆ సీన్స్ చాలా బాగొస్తాయని భావించి ఎవరు చెప్పకపోయినా బాధ్యతతో తెలుగు ఏకాగ్రతతో నేర్చుకుంటుందట. సినిమా డబ్బింగ్ దశకు చేరుకునే వరకు తెలుగు నేర్చుకొని రెడీ ఉండాలని చూస్తుందట అనుపమ.

ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు సొంతంగా డబ్బింగ్ చెప్పడానికి ఏ మాత్రం కృషి చేయలేదు. అలాగే షూటింగ్స్ లలో బిజీగా ఉన్నామంటూ డబ్బింగ్ చెప్పడానికి టైమ్ లేదంటూ జారుకుంటారు. కానీ అనుపమ మాత్రం ప్రస్తుతం ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పాలనే పట్టుదలతో ఉంది. ఆల్రెడీ అ..ఆ అండ్ శతమానం భవతిలో చెప్పింది కూడా. చూద్దాం అమ్మడు తెలుగు పదాలు మన్ముందు ఇంకెంత అందంగా పలుకుతుందో.