Begin typing your search above and press return to search.

ఈ కేరళకుట్టి నవ్వుతోనే మతులు పోగొడుతుందిగా..!

By:  Tupaki Desk   |   2 April 2021 3:30 PM GMT
ఈ కేరళకుట్టి నవ్వుతోనే మతులు పోగొడుతుందిగా..!
X
తెలుగు ప్రేక్షకులు పరిచయం అక్కర్లేని యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అఆ' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అనుపమ.. 'ప్రేమమ్' సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది. ఈ కుర్రభామ ఫస్ట్ నుండి ఆకట్టుకునే నటనతో, కొంటె చూపులతో లక్షల్లో అభిమానులను సొంతం చేసుకుంది. అమ్మడు అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో లేదో కొంత కాలానికే అద్భుతమైన క్రేజ్ సంపాదించుకుని వరుస ఆఫర్స్ తో సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. అమ్మడు యాక్టింగ్ తో పాటు అదనపు టాలెంట్స్ కూడా కలిగి ఉంది. అందరికి అలాంటి టాలెంట్ ఉండదు. కానీ అనుకుంటే జరుగుతుంది. ఈ అమ్మడు మొదటి సినిమా నుండి సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటుంది.

తెలుగులో దాదాపు యంగ్ హీరోల అందరితో సినిమాలు చేసిన అనుపమ.. శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమకోసమే లాంటి సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. చివరిగా లాక్ డౌన్ ముందు 'రాక్షసుడు' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. సినిమాల సంగతి పక్కనపెడితే అనుపమకు సోషల్ మీడియాలో ఏ రేంజి ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. తాజాగా అమ్మడి ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ వేదికగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో అనుపమ బ్లాక్ టాప్, లెహంగా ధరించి నవ్వుతూ పోజిచ్చింది. అలా కర్లీ హెయిర్ తో ముందుకు తలవాల్చి అందమైన నవ్వుతో కుర్రగుండెల్లో చిచ్చురేపుతోంది. అనుపమ గ్లామర్ షో కంటే నవ్వుతోనే ఫేమస్ అయింది. ప్రస్తుతం ఈ వయ్యారి ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.