Begin typing your search above and press return to search.

ఇంత క్లోజప్ లో ఎవరైనా డేర్ చేస్తారా..?

By:  Tupaki Desk   |   15 April 2021 4:57 AM GMT
ఇంత క్లోజప్ లో ఎవరైనా డేర్ చేస్తారా..?
X
ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎంత అందంగా ఉన్నప్పటికీ వాళ్ల ముఖాలు క్లోసప్ లో చూపేందుకు భయపడుతుంటారు. ఎందుకంటే జనరల్ గా హీరోయిన్స్ మేకప్ తీసేస్తే వాళ్ల ముఖాలు చూడటం కూడా కష్టమే అంటుంటారు. వాళ్ల ముఖాలపై ఉండే మొటిమలు, మచ్చలు కనిపిస్తాయని వెనకడుగు వేస్తుంటారు. నిజానికి క్లోసప్ లో ఫోటోలు పెట్టడానికే వెనకాముందు ఆలోచించే హీరోయిన్స్.. అదే క్లోసప్ లో వీడియో పెట్టారంటే ఖచ్చితంగా డేర్ చేసారనే చెప్పాలి. ఎందుకంటే క్లోజప్ షాట్ లో మేకప్ ఇంత చెడిపోయినా ముఖం మీది మచ్చలు, పింపుల్స్ బయటపడతాయి. తర్వాత రెస్పాన్స్ చూసి నిరాశపడాల్సి వస్తుంది. కానీ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాత్రం పెద్ద డేర్ చేసింది.

ఎలాంటి బెరుకు లేకుండా క్లోజప్ లో ఏకంగా వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. అయితే అంత క్లోజప్ షాట్ లో కూడా మేకప్ విషయంలో ఇంత తేడా రాకుండా జాగ్రత్తపడింది అనుపమ. అలాగే కన్నా అంటూ మాంచి మెలోడీ పాట కూడా పాడింది. మరి ఈ లెక్కన చూసుకుంటే అటు క్లోజప్ షాట్ పరంగా.. ఇటు సింగింగ్ పరంగా పెద్ద ధైర్యమే చేసింది. కానీ అనుపమ ఎంత అందంగా కనిపిస్తుందో అంతే అందంగా పాట కూడా పాడటం విశేషం. ప్రస్తుతం ఆ వీడియో చూస్తూ సోషల్ మీడియాలో డేర్ చేసినందుకు పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయట. మరీ ఇంత క్లోజప్ షాట్ లో ఇంత డేర్ చేసిందా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో కార్తికేయ-2, 18పేజెస్ సినిమాలు చేస్తోంది.