Begin typing your search above and press return to search.

ఒక్క హిట్టు పడితే స్టారేనమ్మా..

By:  Tupaki Desk   |   4 Jun 2018 11:30 PM GMT
ఒక్క హిట్టు పడితే స్టారేనమ్మా..
X
చూడచక్కని రూపం.. మంచి అభినయం.. ఆకట్టుకునే గ్లామర్... వీటన్నింటికి మించి అన్నిరకాల భావాలు పలికే నటన... ఇన్ని క్వాలిటీస్ ఉన్న యంగ్ హీరోయిన్లు టాలీవుడ్ చాలా తక్కువమందే ఉన్నారు. వాళ్లలో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గ్యారంటీగా ముందే ఉంటుంది. మళయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుపమకు టాలీవుడ్ వెల్ కం చెప్పింది.

ఓ స్టార్ హీరోయిన్ కావడానికి అవసరమైన అన్ని ఫీచర్లు అనుపమ దగ్గర ఉన్నాయి. ఒక్క కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఆమె ఖాతాలో పడితే ఈ క్యూటీ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. రీసెంట్ గా రామ్ తో ఉన్నది ఒకటే జిందగీ.. నానితో కృష్ణార్జున యుద్ధం సినిమాలు అనుపమ నటన బావుందని పేరొచ్చినా ఆ సినిమాలు బాక్సాఫీసును మెప్పించలేక పోయాయి. దీంతో ఈ మల్లూ బ్యూటీ ఇంకా స్టార్ హీరోయిన్ లీగ్ లోకి రాలేకపోయింది.

ఇప్పుడు అనుపమ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పక్కన తేజ్.. ఐ లవ్ యూ సినిమా చేస్తోంది. ఈ సినిమాను ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్టు కరుణాకరన్ డైరెక్ట్ చేస్తున్నాడు. కరుణాకరన్ మూవీస్ లో హీరోలకెంత పేరొస్తుందో హీరోయిన్లకూ అంతే పేరొస్తుంది. ఈ మూవీ హిట్ అయిందంటే అనుపమకు లక్ కలిసొచ్చినట్లే. అందుకే ఈ మూవీ ప్రమోషన్స్ లో కూడా అనుపమ చాలా యాక్టివ్ గా ఉంటోంది.