Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తో అనుపమ.. అబ్బే లేదట

By:  Tupaki Desk   |   27 Jan 2017 6:20 AM GMT
ఎన్టీఆర్ తో అనుపమ.. అబ్బే లేదట
X
మలయాళీ సుందరాంగి అనుపమా పరమేశ్వరన్ కు టాలీవుడ్ లో లక్కీ గాళ్ ఇమేజ్ వచ్చేసింది. ఈమె తెలుగులో నటించిన మూడు సినిమాలైన అ..ఆ.. ప్రేమమ్.. శతమానం భవతి హిట్ అవడంతో.. ఇక అమ్మడి స్పీడ్ కి బ్రేకుల్లేవనే భావించారంతే. ఇలా లక్కీ డాల్ ఇమేజ్ వచ్చిందో లేదో.. అంతలో అన్ లక్కీ అయిపోయింది పరిస్థితి.

రామ్ చరణ్-సుకుమార్ మూవీలోనూ.. నానితో ఓ సినిమా చేసేందుకు ఎంపిక అయినట్లే అయి.. ఆ ప్రాజెక్టులను చేజార్చుకుంది మలయాళీ కుట్టి. స్టార్ స్టేటస్ కు దగ్గరవుతోందని అనుకునేలోపే.. సిట్యుయేషన్ మారిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త మూవీ జై లవ కుశ లో ఓ హీరోయిన్ గా నటిస్తోందనే టాక్ వచ్చింది. దాని గురించి అడిగితే.. 'ప్రస్తుతం నేను స్క్రిప్టులు వింటున్నాను. ఇప్పటివరకూ ఏదీ కన్ఫాం కాలేదు' అంటూ ఆన్సర్ ఇచ్చింది అనుపమా పరమేశ్వరన్.

యంగ్ టైగర్ తో సినిమాలో ఎంపికైతే.. ఈపాటికే అనుపమ మాటల్లో జోష్ వచ్చేసి ఉండాలి. కానీ ఇంకా స్క్రిప్ట్స్ వినేదగ్గరే ఉందంటే.. ఈ సినిమాలో అమ్మడికి ప్లేస్ దక్కలేదనే అనుకోవాలి. హ్యాట్రిక్ హిట్స్ సాధించిన అనుపమ చేతిలో.. ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేదంటే.. మిస్టేక్ ఎవరి దగ్గర ఉందో ఈజీగానే అర్ధమవుతుంది కదూ!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/