Begin typing your search above and press return to search.

త్రిషను కొత్తమ్మాయ్ బీట్ చేసేసిందా!?

By:  Tupaki Desk   |   1 Nov 2016 9:30 AM GMT
త్రిషను కొత్తమ్మాయ్ బీట్ చేసేసిందా!?
X
టాలీవుడ్ కోలీవుడ్ లలో త్రిష కృష్ణన్ సీనియర్ హీరోయిన్. ఇప్పుడు ఫీల్డ్ ఉన్న భామల్లో యాక్ట్రెస్ గా ఎక్కువ ఎక్స్ పీరియన్స్ ఉన్నవారిలో త్రిష పేరు టాప్ లోనే ఉంటుంది. అయితే.. రోజులు మారిపోతే రేంజ్ ఎలా మారిపోతుందో చెప్పడానికి.. రీసెంట్ గా పడ్డ ధర్మయోగి పోస్టర్లే నిదర్శన.

ధర్మయోగి చిత్రంలో త్రిష కేరక్టర్ కే ప్రాధాన్యత ఎక్కువ. రెండో హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ పాత్ర నామమాత్రమే. కానీ.. పబ్లిసిటీ పోస్టర్లలో మాత్రం త్రిష కంటే అనుపమ పోస్టర్లే ఎక్కువగా వేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ 'అ ఆ'.. చైతుతో చేసిన 'ప్రేమమ్' తో ఇక్కడ కూడా అనుపమ పేరు మార్మోగిపోతోంది. దాదాపుగా ఈ బ్యూటీ క్రౌడ్ పుల్లర్ అయిపోయింది. అందుకే ఈ కొత్తమ్మాయ్ కే ఇంపార్టెన్స్ ఇస్తూ పోస్టర్లు పడ్డాయి.

త్రిష మెయిన్ హీరోయిన్ గా నటించిన సినిమా ప్రచారంలో అనుపమా పరమేశ్వరన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషమయే. సినిమా స్టోరీనే తన చుట్టూ తిరిగినా.. త్రిషకు పబ్లిసిటీలో మాత్రం ఇంపార్టెన్స్ దక్కకపోవడం చూస్తే.. టైమ్ బాబూ టైమ్ అనాల్సిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/