Begin typing your search above and press return to search.

మెమరీ లాస్ పేషెంట్ గా అనుపమ

By:  Tupaki Desk   |   22 May 2018 8:40 AM GMT
మెమరీ లాస్ పేషెంట్ గా అనుపమ
X
కరుణాకరన్ సినిమాలు అంటే లవ్ స్టోరీలను ఎంత అందంగా చూపించవచ్చు అనేలా ఉంటాయని తెలిసిందే. తన స్ట్రెంగ్త్ అయిన లవ్ జోనర్ లోనే సినిమాలను తీస్తూనే ఉంటాడు ఈ దర్శకుడు. ఇప్పుడు తేజ్ ఐ లవ్ యూ అంటూ సాయి ధరం తేజ్ హీరోగా.. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా ఓ సినిమాను తీస్తున్నాడు.

ఈ డైరెక్టర్ సినిమాలలో హీరోయిన్ పాత్రకు కూడా చక్కని ప్రాధాన్యం ఉంటుంది. తేజ్ ఐ లవ్ యూ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న అనుపమ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందట. ఈ సినిమాలో మెమరీ లాస్ పేషెంట్ గా అనుపమ కనిపించనుందని అంటున్నారు. అంటే ప్రేమించిన తర్వాత ఆ వ్యక్తిని మరచిపోవడం.. ఆ తర్వాత అతడికి ఆమెకి ఎదురయ్యే ఇబ్బందులు అన్నట్లుగా కథ సాగుతుందట. మెమరీ లాస్ పేషెంట్ గా అనుపమ నటన ఈ చిత్రానికి హైలైట్ కానుందనే అంచనాలు ఉన్నాయి.

అయితే.. ఈ చిత్రానికి కరుణాకరన్ స్వయంగానే కథ అందిస్తున్నా.. ఇండస్ట్రీ జనాల వెర్షన్ వేరేగా ఉంది. ఓ హాలీవుడ్ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ఈ కథను ప్రిపేర్ చేశారట. రీమేక్ మాదిరిగా కాకుండా.. ఫ్రీమేక్ నే చేసేస్తున్నారట. హాలీవుడ్ మూవీలో కాన్సెప్ట్ వరకే తీసుకుని.. మన ఆడియన్స్ టేస్ట్ కి తగినట్లుగా పాత్రలను చిత్రించి.. తేజ్ ఐ లవ్ యూ మూవీని ప్రిపేర్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.