Begin typing your search above and press return to search.

అనుపమ 'ది న్యాచురల్' బ్యూటీ..!

By:  Tupaki Desk   |   2 Nov 2022 2:30 AM GMT
అనుపమ ది న్యాచురల్ బ్యూటీ..!
X
మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కి సౌత్ లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. మళయాళంలో ప్రేమం సినిమాతో ప్రేక్షకులను అలరించిన అనుపమ అదే సినిమాతో తెలుగు రీమేక్ లో కూడా మెప్పించింది.

అయితే అంతకుముందే త్రివిక్రం తో అఆ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న అమ్మడి అప్పటి నుంచి తెలుగు ఆడియన్స్ ని ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. ఒకప్పుడు బొద్దుగా ముద్దుగా ఉండే అమ్మడు ఇప్పుడు తన లుక్ మార్చి సర్ ప్రైజ్ చేసింది. కెరియర్ లో కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న అమ్మడు ఈమధ్య వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.

తన ట్రెండీ లుక్స్ తో సోషల్ మీడియా ఫాలోవర్స్ ని డిస్ట్రబ్ చేస్తున్న అనుపమ మేకప్ లెస్ ఫోటోలతో కూడా వావ్ అనిపించేస్తుంది. లేటెస్ట్ గా తన న్యాచురల్ లుక్ తో ఫోటో షేర్ చేసింది అనుపమ. ఆ పిక్స్ చూసిన ఫాలోవర్స్ ఏంటమ్మా ఇప్పుడే నిద్ర లేచావా.. మరీ ఫ్యాన్స్ అంటే అంత పిచ్చి ఎందుకు.. పొద్దున్నే లేచి డైరెక్ట్ గా ఫోటోస్ పెట్టేస్తున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన ఎవర్ గ్రీన్ ఎనర్జీతో సినిమాల్లో సత్తా చాటుతున్న అనుపమ ఈమధ్యనే కార్తికేయ 2 హిట్ తో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంది.

ఇక ఇప్పుడు అమ్మడికి చేతినిండా సినిమాలు వస్తున్నాయి. నిఖిల్ తో కార్తికేయ 2 చేయడంతోనే ఈ జోడీ బాగుందని తన నెక్స్ట్ సినిమా 18 పేజెస్ లో కూడా ఆమెని రిపీట్ చేశారు. ఇదే కాకుండా మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో కూడా అనుపమ నటిస్తుంది.

అందులో ఒకటి డీజే టిల్లు సీక్వల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ కాగా మరొకటి స్టార్ హీరో సినిమా అని తెలుస్తుంది. దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ తో రౌడీ బోయ్స్ సినిమాలో రెచ్చిపోయి మరి లిప్ లాక్ చేసిన అనుపమ ఇక మీదట గ్లామర్ రోల్స్ కూడా చేసేందుకు రెడీ అని హింట్ ఇస్తుంది. ఏం చేసినా ఎలా చేసినా కొన్నాళ్లు హీరోయిన్ గా చకచకా సినిమాలు చేసి సినిమాల నుంచి త్వరగానే రిటైర్ అవ్వాలని నిర్ణయించుకుంది అనుపమ.

సినిమాలే కాదు వెబ్ సీరీస్ లకు ఓకే చెబుతున్న అనుపమ ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ షార్ట్ ఫిల్మ్ లో కూడా సత్తా చాటింది. అనుపమ స్లిమ్ లుక్ వర్షన్ 2.o గా చెప్పుకుంటున్నారు. అయితే ఆమెని మొదటి నుంచి అభిమానిస్తున్న ఫ్యాన్స్ మాత్రం ఒకప్పటి బొద్దుగా ఉన్న అనుపమనే మాకు కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.