Begin typing your search above and press return to search.

బటర్ ఫ్లై గా మారిన నిఖిల్ హీరోయిన్!

By:  Tupaki Desk   |   18 Feb 2022 6:58 AM GMT
బటర్ ఫ్లై గా మారిన నిఖిల్ హీరోయిన్!
X
నితిన్ హీరోగా మాట‌ల మాంత్రికుడు రూపొందించిన చిత్రం `అఆ`. స‌మంత హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంలో శ్రీ‌వ‌ల్లిగా న‌టించి చుర‌క‌త్తుల్లాంటి క‌ళ్ల‌తో మెస్మ‌రైజ్ చేసింది మ‌ల‌యాళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ఇదే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. క‌ర్లింగ్ హెయిర్ తో సోగ‌క‌ళ్ల సుంద‌రిగా ఆక‌ట్టుకున్న అనుప‌మ తెలుగులో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే స్టార్ హీరోయిన్ ల జాబితాలో మాత్రం చేర‌లేక‌పోయింది.

శ‌త‌మానం భ‌వ‌తి - ప్రేమ‌మ్ - ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ.. హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే..రాక్ష‌సుడు - రీసెంట్ గా `రౌడీ బాయ్స్‌` వంటి చిత్రాల‌తో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం అనుప‌మ చేతిలో తెలుగులో మొత్తం మూడు చిత్రాలున్నాయి. నిఖిల్ తో రెండు చిత్రాల్లో న‌టిస్తోంది. కార్తికేయ సీక్వెల్ గా రూపొందుతున్న కార్తీకేయ 2, సుకుమార్ నిర్మాణ స‌హ‌కారంలో గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న `18 పేజెస్‌`..అలాగే హెలెన్ చిత్రాలున్నాయి. తాజాగా మ‌రో చిత్రాన్ని అంగీక‌రించింది.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం `బ‌ట‌ర్ ఫ్లై`. నేడు అనుప‌మ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆమె న‌టిస్తున్న తాజా చిత్రం `బ‌ట‌ర్ ఫ్లై` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని మేక‌ర్స్ శుక్ర‌వారం విడుద‌ల చేశారు. జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యాన‌ర్ పై గంటా స‌తీష్ బాబు ద‌ర్శ‌క‌త్వం లో ర‌వి ప్ర‌కాష్ బోడ‌పాటి, ప్ర‌సాద్ తిరువ‌ళ్లూరి, ప్ర‌దీప్ న‌ల్లిమెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో ఓ వాల్ ముందు చేతులు క‌ట్ట‌కుని అనుప‌మ క‌నిపిస్తుండ‌గా.. వెన‌కాల స‌ప్త‌వ‌ర్ణాల బ‌ట‌ర్ ఫ్లై (సీతాకోక చిలుక) రెక్క‌లు విప్పుకుని క‌నిపిస్తున్న తీరు అనుప‌మే బ‌ట‌ర్ ఫ్లై మారిపోయిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

యువ‌త‌తో పాటు ఫ్యామిఈ ఆడియ‌న్స్ ని ఆక‌ట్టుకునే క‌థ‌, క‌థ‌నాల‌తో ఓ స‌రికొత్త క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌టికి రానున్నాయ‌ని చిత్ర బృందం తెలిపింది. అర‌వింద్ షారోన్, గిడోన్ క‌ట్టా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి స‌మీర్ రెడ్డి ఛాయాగ్ర‌హ‌ణం - ఆర్ట్ విజ‌య్ కుమార్ మ‌క్కెన - ఎడిటింగ్ మ‌ధు - డైలాగ్స్ ద‌క్షిణామార్తి - పాట‌లు అనంత‌శ్రీ‌రామ్ అందిస్తున్నారు.