Begin typing your search above and press return to search.

అనుపమ.. నల్లని చీరలో టాటూ కనిపించేలా..

By:  Tupaki Desk   |   8 Dec 2022 3:30 PM GMT
అనుపమ.. నల్లని చీరలో టాటూ కనిపించేలా..
X
మలయాళం ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ కూడా తెలుగులో చాలా తొందరగా క్రేజ్ అందుకున్న వారిలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో తన పాత్ర పర్ఫెక్ట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. కాస్త గ్లామరస్ హద్దులు దాటినా కూడా అందులో వల్గారిటీ లేకుండా ఉండే విధంగా ఆలోచిస్తుంది.

ఇటీవల కాలంలో రౌడీ బాయ్ సినిమాలోని ఏకంగా లిప్ లాక్ సన్నివేశంలో కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. చాలా వరకు అలాంటి పాత్రలకు నో చెబుతూ వచ్చిన ఆమె ఆ సినిమాలో అలా కనిపించడంతో ఫ్యాన్స్ అయితే ఒక్కసారిగా స్టన్ అయ్యారు. అయితే పాత్ర నచ్చితే మాత్రం అలాంటి సీన్స్ లో నటించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని కూడా అని చెప్పేసింది.

ఇక ఇటీవల అనుపమ పరమేశ్వరన్ కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచుతున్నట్లు అనిపిస్తోంది. అలాగని మరి ఎక్కువగా స్కిన్ షో చేయకుండా చాలా అందంగా రాఘవేంద్రరావు సినిమాలోని హీరోయిన్ తరహాలో కనిపిస్తోంది. రీసెంట్ గా నల్లని చీరలో కనిపించిన విధానం కూడా ఫ్యాన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. అంతేకాకుండా అనుపమ ఎదపై ఏదో పచ్చబొట్టు వేయించుకున్నట్టు కనిపిస్తోంది.

దానికి తోడు ఆమె స్మైల్ కూడా మరింత అందంగా ఉండడంతో ఆ ఫోటోలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ప్రపంచంలో వైరల్ గా మారిపోతున్నాయి. అనుపమ పరమేశ్వరన్ ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా వైరల్ అవుతుంది అని మరోసారి రుజువు చేస్తోంది.

ఇక ఈ బ్యూటీ ఇటీవల కార్తికేయ 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఆమె 18 పెజెస్ అనే మరో సినిమా చేసింది. ఆ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అలాగే అనుపమ తమిళంలో మరో సినిమా కూడా చేస్తోంది. ఇక మలయాళం ఇండస్ట్రీలో కూడా ప్రస్తుతం ఆమె కొన్ని ప్రాజెక్టుల్లో నటించడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.