Begin typing your search above and press return to search.

ఆ విషయం అనుపమ మరిచినా అభిమానులు మరువలేదుగా..!

By:  Tupaki Desk   |   8 April 2021 9:38 AM IST
ఆ విషయం అనుపమ మరిచినా అభిమానులు మరువలేదుగా..!
X
ఇండస్ట్రీపరంగా కొన్ని విషయాలను సెలబ్రిటీలు మరిచిపోతారేమో గాని అభిమానులు మాత్రం మరువలేరు. ఎందుకంటే ఆ విషయాలు అభిమానులకు బాగా దగ్గరగా ఉంటాయి. లేదా సంతోషాన్ని కలిగించిన విషయాలు అయ్యుంటాయి. అలాంటి విషయాలను అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఆ విషయాలను గుర్తుచేస్తూనే ఉంటారు. తాజాగా అలాంటి పరిస్థితినే ఫేస్ చేసింది యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఈ భామ గతంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వదులుకుందట. ఆ విషయం ఆమెకు గుర్తులేదు కానీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాత్రం మరోసారి ప్రస్తావించారు. మరి అనుపమ ఏ సినిమా వదులుకుంది అంటే బ్లాక్ బస్టర్ రంగస్థలం సినిమానట.

చాలకాలం తర్వాత అనుపమ సోషల్ మీడియాలో ప్రత్యక్షమై అభిమానులతో ముచ్చటించింది. ఫ్యాన్స్ పలు క్రేజీ ప్రశ్నలతో పాటు రంగస్థలం టాపిక్ కూడా ఇండైరెక్ట్ గా అడిగినట్లు తెలుస్తుంది. అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు అనుపమ టకటక సమాధానం చెప్పింది కానీ రాంచరణ్ టాపిక్ రాగానే మూతి ముడుచుకుంది. నిజానికి అనుపమ కాదన్న తర్వాతే రామలక్ష్మి క్యారెక్టర్ సమంత చేతికి వెళ్ళిందట. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమేగాక సమంతకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఓ అభిమాని.. 'రాంచరణ్ మీ కాంబినేషన్ లో సినిమా చూడొచ్చా?' అనే ప్రశ్న అడిగాడు. దానికి సమాధానం ఇవ్వడం ఇష్టం లేదేమో అమ్మడు మూతి వంకరగా పెట్టిన పిక్ రిప్లైగా పెట్టింది. ఆ ఫోటో చూసి అర్ధం చేసుకోవచ్చు ఆమె స్పందించడం ఇష్టం లేదని అంటూ నేటిజన్లు చెబుతున్నారు. ఇక మొన్నటివరకు సన్నగా మారిన అనుపమ ప్రస్తుతం బొద్దుగా మారేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలిపింది