Begin typing your search above and press return to search.

అనుపమ ఐదు లిప్ లాక్ లు షాకింగే

By:  Tupaki Desk   |   30 Oct 2021 3:45 AM GMT
అనుపమ ఐదు లిప్ లాక్ లు షాకింగే
X
మ‌ల‌యాళం నుంచి టాలీవుడ్ లో ప్ర‌వేశించి ఇక్క‌డ అగ్ర క‌థానాయిక‌లుగా ఎదిగేస్తున్నారు చాలామంది భామ‌లు. న‌య‌న‌తార మొద‌లు నిత్యా మీన‌న్ వ‌ర‌కూ ఈ త‌ర‌హా హ‌వా కొన‌సాగింది.. ఇటీవ‌ల కీర్తి సురేష్ .. నివేద థామ‌స్ లాంటి భామ‌లు టాలీవుడ్ లో వ‌రుసగా అవ‌కాశాలు అందుకుంటున్నారు. అయితే ఆ ఇద్ద‌రితో పాటే రంగంలోకి దిగిన‌ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కెరీర్ ఆశించినంత‌గా సాగ‌లేదు. ప్రేమ‌మ్ చిత్రంతో తెలుగులో ప్ర‌వేశించి ఆరంగేట్ర‌మే యూత్ ఫేవ‌రెట్ బ్యూటీగా ఆక‌ర్షించింది. అటుపై ప‌లువురు అగ్ర హీరోల సినిమాల్లో న‌టించినా కానీ ఎందుక‌నో అనుప‌మ‌కు ఆశించినంత మైలేజ్ ద‌క్క‌లేదు.

అయితే ట్రెడిష‌న్ విష‌యంలో అనుప‌మ ప‌ట్టు విడుపు చూప‌క‌పోవ‌డ‌మే త‌న ఎదుగుద‌ల‌కు బ్రేక్ వేసింద‌నేది ఇండ‌స్ట్రీ ఇన్ సైడ్ గుస‌గుస‌. హ‌ద్దు మీరి లిప్ లాక్ ల‌కు చిట్టి పొట్టి దుస్తులను ధ‌రించేందుకు అనుప‌మ పూర్తి వ్య‌తిరేకం. కేవ‌లం త‌నవైన క్యూట్ లుక్స్.. న‌ట‌నాభియంపై ఆధార‌ప‌డి రాణిస్తోంది. అయితే ఇప్పుడు ఓ యూత్ ఫుల్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ `రౌడీ బాయ్స్` కోసం హ‌ద్దు మీరిందని గుస‌గుసలు వినిపిస్తున్నాయి. ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు పెద‌వి ముద్దుల‌తో కుర్ర‌కారు గుండెల్ని చిద్రం చేయ‌నుంద‌ట‌. బెడ్ రూమ్ స‌న్నివేశాల్లోనూ ఘాటైన రొమాన్స్ తో మెరుపులు మెరిపించ‌నుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అగ్ర‌నిర్మాత దిల్ రాజు సోద‌రుని కుమారుడు కొత్త హీరో ఆశిష్ తో అనుప‌మ ఈసారి జతకట్టింది. అర్జున్ రెడ్డి రేంజులో అత‌డు ఈ మూవీలో లిప్ లాక్ ల‌తో చెల‌రేగుతాడ‌ట‌. అత‌డితో పోటీప‌డుతూ అనుప‌మ అద‌ర‌చుంబ‌నాల్లో హీటెక్కిస్తుంద‌ట‌. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ వీటి గురించి రివీల్ చేయ‌లేదు. ముద్దులు చాలా ఘాటుగా.. పచ్చిగా ఉన్నాయని లీకులు అందుతున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులు షాక్ అవుతార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

రౌడీ బాయ్స్ చిత్రం విడుదలైన తర్వాత అనుపమ ఇమేజ్ అమాంతం మారిపోతుంద‌ని కూడా చెప్పుకుంటున్నారు. ఇప్ప‌టికే తొలి టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. త‌దుప‌రి ట్రైల‌ర్ లో లిప్ లాక్ ని ఆవిష్క‌రించి వేడెక్కిస్తార‌ట‌. యూత్ ఫుల్ ప్రేమ‌క‌థా చిత్రం కాబ‌ట్టి ఆ మాత్రం ఘాటైన స‌న్నివేశాల‌కు కొద‌వేమీ ఉండ‌ద‌ని చెబుతున్నారు. హుషారు ఫేమ్ దర్శకుడు శ్రీహర్ష కొంగువంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదల తేదీని ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మ‌ది సినిమాటోగ్ర‌ఫీ అదించారు.