Begin typing your search above and press return to search.

లాస్ ఏంజిల్స్ వ్యభిచార కూపం

By:  Tupaki Desk   |   25 April 2016 3:30 PM GMT
లాస్ ఏంజిల్స్ వ్యభిచార కూపం
X
అమెరికాలో రెండో అతి పెద్ద నగరం లాస్ ఏంజిల్స్. సిటీ ఎంత విస్తృతమో.. ఇక్కడి వేశ్యా గృహాలు అంతే ఫేమస్. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఈ వృత్తి చట్టబద్ధం కావడంతో.. బలవంతంగా ఇందులోకి దింపేందుకు ప్రపంచం మొత్తం నుంచి అమ్మాయిలను తెచ్చేస్తుంటారు. సాధారణంగా చైనా - ఇండియాల నుంచి కిడ్నాప్ చేసిన అమ్మాయిలే ఇందులో ఎక్కువగా ఉంటారట.

ఇలాంటి వాస్తవాలను కళ్లారా చూసిన ఓ వ్యక్తి అదే కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నాడు. పోలీసులతో కలిసి వ్యభిచార గృహాలపై దాడులు చేసే సమయంలో కొన్నింటిని దగ్గరుండి పరిశీలించి మరీ వాస్తవాలను సేకరించాడు నూరానీ అనే వ్యక్తి. ఇతను తీస్తున్న ఈ మూవీ పేరు లవ్ సోనియా. లాస్ ఏంజిల్స్ లో తాను చూసిన ఓ అమ్మాయి వాస్తవగాధనే సినిమాగా మలుస్తున్నట్లు చెబుతున్నాడు నూరానీ. లైఫ్ ఆఫ్ పై నిర్మాత డేవిడ్ తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు నూరానీ.

మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం రాజస్థాన్ లోను - హాంకాంగ్ - లాస్ ఏంజిల్స్ లోనూ షూటింగ్ చేయనున్నారు. లవ్ సోనియాలో ఫ్రిదా పింటో - రిచా చడ్డా - అనుపమ్ ఖేర్ - మనోజ్ బాజ్ పాయ్ కూడా నటిస్తున్నారు. ది హల్క్ - లైఫ్ ఆప్ పై వంటి చిత్రాలను నిర్మించిన డేవిడ్ నిర్మాత కావడంతో.. హాలీవుడ్ లో కూడా లవ్ సోనియాపై ఆసక్తి నెలకొంది.