Begin typing your search above and press return to search.

ఆడియో ఆ రేంజులో లేదు మరి!!

By:  Tupaki Desk   |   23 Sept 2015 1:00 AM IST
ఆడియో ఆ రేంజులో లేదు మరి!!
X
అక్కినేని ఫ్యామిలీలో యంగ్ జనరేషన్ స్టార్ అఖిల్. తాత అక్కినేని నాగేశ్వరరావు బర్త్ డే రోజున అత్యంత వైభవంగా ఆడియో ఫంక్షన్ నిర్వహించారు. ఈ స్థాయిలో తెలుగులో ఏ మూవీకి ఆడియో రిలీజ్ వేడుక జరగలేదనే చెప్పాలి.

ఐదు సాంగ్స్ ఉన్న అఖిల్ ఆల్బంలో.. ఒక పాటకు తమన్ సంగీతం అందించగా, మిగిలిన నాలుగింటికి అనూప్ రూబెన్స్ బాణీలు కట్టాడు. నితిన్ కి - అనూప్ కి ఉన్న స్ట్రాంగ్ రిలేషన్ కారణంగా.. ఇతగాడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సాధారణంగా అనూప్ రూబెన్స్ మెలోడీలకు ట్యూన్స్ ఇరగదీస్తాడు. ఎందుకో మరీ అఖిల్ కోసం అన్నీ ఫాస్ట్ బీట్స్ ట్రై చేశాడు. డ్యాన్స్ బేస్డ్ సాంగ్స్ కి అనూప్ ట్యూన్స్ ఇచ్చినా.. అవేవీ అంతగా ఆకట్టుకునేలా లేవు. అఖిల్ డ్యాన్స్ చూసి సంతోషించాల్సిందే తప్ప... మ్యూజిక్ లో మాత్రం ఏం మ్యాజిక్ లేదు. ''మనం''తో మెస్మరైజ్ చేసిన అనూప్.. ఈసారి ఆ రేంజ్ కి చేరుకోవడంలో ఫెయిలయ్యాడనే చెప్పాలి.

ఇక థమన్ బాణీ కట్టిన మెలోడీ 'పడేశావే' అంటూ సాగుతుంది. అద్భుతమైన వినాయక్ ట్రీట్మెంట్, అదిరిపోయే విజువల్స్ కారణంగా.. మూవీలో మాత్రం ఈ సాంగ్స్ బాగానే ఉండొచ్చు కానీ.. విడిగా ట్యూన్స్ వరకూ చూస్తే.. ఇది పర్వాలేదనిపించే ఆల్బం మాత్రమే. అక్టోబర్ 22న మూవీ రిలీజ్ అవుతుందని నాగ్ స్వయంగా ప్రకటించిడంతో.. అఖిల్‌ పై అంచనాలు చాలానే ఉన్నాయి.