Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ లో శృంగార సినిమా చూపిస్తున్నారుగా!

By:  Tupaki Desk   |   29 Sep 2018 1:11 PM GMT
బిగ్‌ బాస్‌ లో శృంగార సినిమా చూపిస్తున్నారుగా!
X
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బిగ్‌ బాస్‌ షో హిందీలో ఇప్పటి వరకు 11 సీజన్‌ లను పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. తాజాగా 12వ సీజన్‌ ప్రారంభం అయ్యింది. ఈసారి ప్రత్యేకంగా జంటలతో బిగ్‌ బాస్‌ షోను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. సల్మాన్‌ ఖాన్‌ హోస్టింగ్‌ గా వ్యవహరిస్తున్న ఈ షోలో జస్లీన్‌ మాతురు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈమె అనూప్‌ జలోటా ప్రియురాలిగా బిగ్‌ బాస్‌ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

సీజన్‌ ప్రారంభం అయిన కొద్ది రోజుల్లోనే ఈమె అందరి దృష్టిలో పడిపోయింది. 65 ఏళ్ల అనూప్‌ జలోటాకు ఈమె ప్రియురాలు అవ్వడంతో బిగ్‌ బాస్‌ ప్రేక్షకులు అంతా కూడా అవాక్కవుతున్నారు. ముసలోడైన అనూప్‌ జలోటాకు ఈమె పదే పదే ముద్దులు పెట్టడం - వీరిద్దరి మద్య రొమాన్స్‌ ఒక చిన్న తరహా శృంగార సినిమా చూసినట్లుగా ఉందని బిగ్‌ బాస్‌ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జస్లీన్‌ మాతురు తాజా ఎపిసోడ్‌ లో రెడ్‌ బికినీలో స్విమ్మింగ్‌ పూల్‌ లో స్మిమ్‌ చేస్తుంటే ప్రేక్షకులతో పాటు - ఇతర ఇంటి సభ్యులు కూడా పూల్‌ ముందు కళ్లు అప్పగించి అలాగే చూస్తూ ఉండిపోయారు. ఈమె తన అందాలతో బిగ్‌ బాస్‌ కు గ్లామర్‌ తీసుకు వచ్చిందని అంటున్నారు. ఈమెతో బిగ్‌ బాస్‌ నిర్వాహకులు కేవలం నెల రోజుల పాటు మాత్రమే ఒప్పందం చేసుకున్నారట. ఈవిషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పుకొచ్చింది.

పలు అంతర్జాతీయ వేదికలపై పోగ్రాంస్‌ చేసే ఈమె అక్టోబర్‌లో కాలిఫోర్నియాలో ఈవెంట్‌ చేయాల్సి ఉంది. అందుకే అప్పటి వరకు ఈమె ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అందంతో ప్రేక్షకులతో పాటు ఇంటి సభ్యుల్లో హీట్‌ పెంచిన జస్లీన్‌ మినీ పోర్న్‌ మూవీ చూపిస్తున్నట్లుగా అనిపిస్తుందని బాలీవుడ్‌ వర్గాల వారు కూడా అంటున్నారు.