Begin typing your search above and press return to search.

టీజర్ టాక్ : నటకిరీటి 'అనుకోని ప్రయాణం' ఇంట్రెస్టింగ్‌

By:  Tupaki Desk   |   19 July 2022 1:13 PM GMT
టీజర్ టాక్ : నటకిరీటి అనుకోని ప్రయాణం ఇంట్రెస్టింగ్‌
X
హీరోగా.. కమెడియన్‌ గా.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌ లో కొనసాగుతున్న నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'అనుకోని ప్రయాణం'.

ఈ సినిమా టీజర్ ను రాజేంద్ర ప్రసాద్‌ పుట్టిన రోజు సందర్బంగా యూనిట్‌ సభ్యులు విడుదల చేయడం జరిగింది. సినిమా లో రాజేంద్ర ప్రసాద్‌ తో పాటు కీలక పాత్రలో ఆయన మిత్రుడిగా సీనియర్ నటుడు నరసింహ రాజు కనిపించబోతున్నారు.

అనుకోకుండా మొదలు పెట్టిన ప్రయాణంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి.. ఆ సమస్యలు కొన్ని జీవితాలను ఎలా మలుపు తిప్పాయి అనేది ఈ సినిమా లో చూపించబోతున్నట్లుగా టీజర్‌ ను చూస్తుంటే అర్థం అవుతోంది. విభిన్నమైన పాత్రలు.. ఆకట్టుకునే కథనంతో ఈ సినిమా ను రూపొందించినట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈ సినిమా టీజర్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు విడుదల చేశారు. టీజర్ కు రాఘవేంద్ర రావు నుండి ప్రశంసలు దక్కాయని యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు.

సినిమా విడుదల ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే సినిమా విడుదల చేయబోతున్నట్లుగా టీజర్ లోని చిన్న డైలాగ్ తో రాజేంద్ర ప్రసాద్‌ చేతనే దర్శకుడు కాస్త క్రియేటివ్ గా చెప్పించారు.

టీజర్ లోని డైలాగ్‌ నా అనుకునే వారిని దేవుడు నిర్ణయిస్తాడు.. కానీ స్నేహితులను మాత్రం మనమే సెలక్ట్ చేసుకోవచ్చు అనే డైలాగ్‌ అందరికి ఎమోషనల్‌ గా కనెక్ట్‌ అయ్యే విధంగా ఉంది. ఈ డైలాగ్‌ చుట్టు కథ తిరుగుతుందని టీజర్ ను చూస్తూ ఉంటే అనిపిస్తుంది. రాజేంద్ర ప్రసాద్‌ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఉంటుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.