Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: నాలుగు లడ్డూలు కావాలా నాయనా?

By:  Tupaki Desk   |   20 May 2020 2:30 AM GMT
ఫోటో స్టోరీ: నాలుగు లడ్డూలు కావాలా నాయనా?
X
అను ఇమ్మాన్యుయేల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న పేరే. నాని 'మజ్ను'.. పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'.. అల్లు అర్జున్ 'నాపేరు సూర్య'.. నాగ చైతన్య 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాలలో నటించింది. సినిమాల సంగతి ఇలా ఉంటే హిట్లు ఫ్లాపుల గోలతో సంబంధం లేకుండా ఈ జెనరేషన్ హీరోయిన్ల లాగా సోషల్ మీడియాలో సూపర్ డూపర్ యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లను.. అభిమానులను మురిపిస్తూ ఉంటుంది.

తాజాగా అను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఇది నిజానికి ఫోటో కాదు. నాలుగు ఫోటోలున్న కొలేజ్. దీనికి "ఎందుకంటే ఒకటి కంటే నాలుగు బెటర్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఒక్క అనును చూస్తేనే ఆ గ్లామర్ దెబ్బకు నెటిజన్లకు నోటమాట పడిపోతుంది. ఇక నలుగురు అనులు ఒకే చోట... అంటే నాలుగు లడ్డూలు కావాలా నాయనా అన్నట్టుంది. మరి ఈ నాలుగు సిద్ధాంతం జస్ట్ ఫోటోల సంఖ్యకు మాత్రమే పరిమితం చెయ్యాలా లేక అన్నిటికి అప్లై చేసి దబిడిదిబిడిగా మార్చెయ్యాలా అనేది మన ఛాయిస్. ఒక సినిమాకు నాలుగు ఇంటర్వెల్స్.. నాలుగు క్లైమాక్సులు ఉంటే ఎలా ఉంటుంది? బుర్ర హీటెక్కక మానదు. అందుకే ఈ ఫోర్ థీరీ ఈ ఫోటోకు మాత్రమే పరిమితం చేస్తే సరి.

ఈ ఫోటోలు అన్నీ క్లోజప్ క్లిక్సే కాబట్టి అను ఎంతో అందంగా కనిపిస్తోంది. అను ముక్కుపుడక అదిరిపోయింది. ఈమధ్య కాలంలో ఎక్కువమంది నోస్ రింగ్ దరించడం లేదు కానీ అది కొందరికి భలేగా సూట్ అవుతుంది. అనుకి సూపర్ గా సెట్ అయింది. ఇక అను ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్-బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అల్లుడు అదుర్స్' సినిమాలో నటిస్తోంది.