Begin typing your search above and press return to search.

అనూ ఫీలింగ్ బ్లూ.. ఫేవ‌రెట్ అంటూ వెంట‌ప‌డ్డ ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   26 Jun 2021 10:30 AM GMT
అనూ ఫీలింగ్ బ్లూ.. ఫేవ‌రెట్ అంటూ వెంట‌ప‌డ్డ ఫ్యాన్స్
X
గ‌త కొంత‌కాలంగా అను ఇమ్మాన్యుయేల్ వైఖ‌రిని ప‌రిశీలిస్తుంటే ఈ బ్యూటీ ఏదో తెలీని ట్రాన్స్ లో ఉందేమో! అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. ఫీలింగ్ బ్లూ .. ఫీలింగ్ ల‌వ్! అంటూ త‌న‌లోని ఫీలింగ్స్ ని బ‌య‌ట పెట్టేస్తుంటే అమ్మ‌డు ఒక‌వేళ ప్రేమలో ప‌డిందేమో! అంటూ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

అడ‌పా ద‌డ‌పా అయినా క్లాసిక్ అన‌ద‌గ్గ ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేస్తున్న అనూ త‌న‌లోని అంత‌ర్మ‌ధ‌నాన్ని విర‌హాగ్నిని అస్స‌లు దాచుకోవ‌డం లేదు. తాజాగా మ‌రో హాట్ ఫోటోని అనూ షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. తెలుపు మ‌రియు నీలి రంగు ఫ్రాకులో అనూ అలా సొగ‌సుగా నేల‌పై కూచున్న తీరు ఆక‌ట్టుకుంది. అలా మ‌త్తు క‌ళ్ల‌తో కుర్ర‌కారు గుండె గిల్లుతున్న అనూని చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది! అంటూ సందిగ్ధం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఒక‌వేళ అనూ ప్రేమ‌లో ప‌డిందా? ప్రేమ‌లో ఉంటే ఆ విష‌యాన్ని ఎందుక‌ని దాస్తోంది? అంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అన్న‌ట్టు స‌హ‌జీవ‌నం నేప‌థ్యంలో అనూ `ప్రేమ కాదంట` అనే మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అల్లు శిరీష్ క‌థానాయ‌కుడు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన రొమాంటిక్ లుక్ కి స్పంద‌న బావుంది. అన్న‌ట్టు అనూ ఫీలింగ్ బ్లూ అన‌గానే నా ఫేవ‌రెట్ క‌ల‌ర్ బ్లూ మ్యాడ‌మ్ అంటూ వెంట‌ప‌డుతున్నారు ఫ్యాన్స్! మ‌రి వాళ్లంద‌రికీ ఏమని స‌మాధాన‌మిస్తుందో ఏమిటో...!