Begin typing your search above and press return to search.

నాని హీరోయిన్‌ తో ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌

By:  Tupaki Desk   |   1 Dec 2016 11:30 AM GMT
నాని హీరోయిన్‌ తో ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌
X
ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ సినిమాకి సంబంధించిన పనులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. ఇదివ‌ర‌కు ప‌వ‌న్ సినిమా అంటే కొబ్బ‌రికాయ కొట్టాక ఆర్నెళ్ల‌కిగానీ హీరోయిన్ ఎంపిక పూర్త‌య్యేది కాదు. హీరోయిన్ ఎంపిక‌య్యాక ఎప్పుడో కానీ సెట్స్‌పైకి వెళ్లేవాళ్లు కాదు. కానీ ఈసారి మాత్రం ఆయ‌న చాలా స్పీడుమీదున్నారు. తాజాగా రెండో హీరోయిన్‌ ని కూడా ఎంపిక చేశారు. ఆ ప్లేస్‌ని ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అప్‌ క‌మింగ్ భామ అను ఇమ్మాన్యుయేల్ సొంతం చేసుకోవ‌డం విశేషం. ప‌లువురు క‌థానాయిక‌ల్ని ప‌రిశీలించిన ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ - త్రివిక్ర‌మ్ ఇద్ద‌రూ కూడా అనుకే ఓటేశార‌ట‌. ఈసారి ప‌వ‌న్ స‌ర‌స‌న ఆడిపాడే ఇద్ద‌రు క‌థానాయిక‌లు కూడా మ‌ల‌యాళ భామ‌లే అన్న‌మాట‌.

ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. జ‌ల్సా - అత్తారింటికి దారేది త‌ర్వాత ఆ కాంబోలో వ‌స్తున్న మూడో చిత్ర‌మిది. ఇందులో ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కి చోటుంది. ఓ క‌థానాయిక‌గా కీర్తి సురేష్‌ ని ఎంపిక చేశారు. మ‌రో క‌థానాయిక‌గా తాజాగా అను ఇమ్మాన్యుయేల్‌ ని ఎంపిక చేశారు. ఈ ఇద్ద‌రూ కూడా మ‌ల‌యాళీ భామ‌లే కావ‌డం విశేషం. నానితో క‌లిసి మ‌జ్నులో ఆడిపాడింది అను. తెలుగులో చేసిన తొలి సినిమాతోనే ఆమె ప్రేక్ష‌కుల మ‌న‌సుని దోచింది. క‌చ్చితంగా స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాలు సొంతం చేసుకుంటుంద‌ని అనుకొన్నారంతా. అనుకున్న‌ట్టుగానే ఆమె ఇప్పుడు ఏకంగా ప‌వ‌న్‌ తో న‌టించే ఛాన్స్ కొట్టింది. ప‌వ‌న్‌తో సినిమా అంటే ఆమె క్రేజ్ రెండింత‌లు పెరిగిన‌ట్టే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/