Begin typing your search above and press return to search.

మళ్ళీ మల్లూయే అంటున్న నాని!!

By:  Tupaki Desk   |   4 July 2016 12:34 PM GMT
మళ్ళీ మల్లూయే అంటున్న నాని!!
X
ఒక్కోసారి అంతే.. ఏదన్నా ఒక పని చేస్తే ఆ సినిమా హిట్టయ్యిందంటే.. మళ్ళీ మళ్ళీ అదే పని చేయడం మనోళ్లకు అలవాటైపోతుంది. దానిని ఇక్కడ సెంటిమెంట్‌ అంటారు కూడా. ఎంతో టాలెంట్ ఉన్న హీరో నాని ఉన్నాడు చూడండి.. మనోడు ఆ మధ్యన క్లీన్ షేవ్‌ చేసి కొన్ని సినిమాలు చేస్తే.. అవి ఫ్లాపయ్యాయ్‌. దెబ్బతో షేవ్‌ చేయడం మానేశాడు. అన్ని సినిమాల్లోనూ అదే మాసిన గెడ్డంతో కనిపిస్తాడు. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్ ఇంకోటి వచ్చి పడిందట.

అప్పట్లో అలామైదలైంది ఎలాగైతే స్లీపర్ హిట్టయ్యిందో.. ఇప్పుడు జెంటిల్మన్ కూడా అలాగే ఆడుతోంది. ఈ రెండు సినిమాలకు ఒకే ఒక్క సంబంధం ఏంటంటే.. రెండింటిలోనూ మలయాళ కుట్టీలే హీరోయిన్లు. అప్పుడు నిత్యా మీనన్‌.. ఇప్పుడు నివేదా థామస్ లు.. మనోడికి లక్‌ తెచ్చారనే ఒక నమ్మకం ఉందట. కంటెంట్‌ లో ఎంత దమ్మున్నా కూడా.. ఈ లక్ ను కూడా నమ్మాల్సిందే అనే ప్రొడ్యూసర్లు ఉన్న ఈరోజుల్లో.. నాని తదుపరి సినిమాకు ఒక మల్లూ బ్యూటీనే హీరోయిన్‌ గా తీసుకుంటే అస్సలు ఆశ్చర్యపోవక్కర్లేదుగా.

త్వరలోనే షూటింగ్‌ ప్రారంభమవ్వనున్న దర్శకుడు విరించి వర్మ కొత్త సినిమాకు గాను.. అనూ ఇమ్మానుయేల్‌ అనే అమ్మాయిని హీరోయిన్‌ గా సైన్ చేశారట. ఈ సినిమాలో ఆమె ఒక విలేజ్ గాళ్‌ పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమకంటే ముందే తెలుగులో ఆక్సిజన్‌ సినిమాలో ఒక పాత్రలో మెరుస్తోంది అనూ. సర్లేండి.. నాని ఇంకెందరు మల్లూ కుట్టీలను దించుతాడో చూస్కోండి.