Begin typing your search above and press return to search.

అను సిస్టర్ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ!

By:  Tupaki Desk   |   4 Aug 2018 10:32 PM IST
అను సిస్టర్ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ!
X
ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లు సినిమాల్లోకి రావటం సహజంగా జరిగేదే. ఇప్పుడు అలానే టాలీవుడ్ హీరోయిన్ అయిన అను ఇమ్మాన్యుయేల్ బాటలో ఆమె కజిన్ రెబా మోనికా జాన్ కుడా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అను ఇమ్మాన్యుయేల్ చాలా తక్కువ సమయంలోనే టాప్ స్టార్స్ సినిమాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి అక్క బాటలోనే రెబా మోనికా కుడా టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుంది.

న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం 'జెర్సీ' లో ఒక కీలక పాత్ర కోసం రెబా మోనికా ను తీసుకున్నారట. ఆమెకి ది టాలీవుడ్ డెబ్యునే కాని మొదటి సినిమా మాత్రంకాదు. ఆమె ఇప్పటికే మోడలింగ్ రంగంలో సత్తా చాటి ఆతర్వాత మలయాళం - తమిళ సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు తెలుగులో తొలి సినిమాలోనే నానితో నటించే అవకాశం సొంతం చేసుకోవడం విశేషం. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మరి ఆమెకు ఎలాంటి పాత్ర లభించిందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

'జెర్సీ' సినిమాకు 'మళ్ళీ రావా' ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ గతంలో పవన్ కళ్యాణ్ సినిమా 'అజ్ఞాతవాసి' లో ఒక హీరోయిన్. ఆ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై తెరకెక్కించినవిషయం తెలిసిందే. మరోవైపు నాని తో 'మజ్ను' సినిమాలో నటించింది. సో.. ఆ కనెక్షన్స్ తో తన కజిన్ కి మంచి 'జెర్సీ' ఆఫర్ ఇప్పించిందేమో!