Begin typing your search above and press return to search.

పవన్ అండ్ అల్లు హిట్టిస్తే మాత్రం..

By:  Tupaki Desk   |   11 July 2017 4:47 AM GMT
పవన్ అండ్ అల్లు హిట్టిస్తే మాత్రం..
X
మన ఇండస్ట్రికి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. మనం హీరోలు మాత్రం లోకల్ ఎప్పటికే వాళ్ళే స్టార్లు. కానీ ఇప్పుడు మన తెలుగు సినిమా వాతావరణం కొత్త హీరోయిన్లుకు అనుకూలంగానే ఉంది. ఉన్న స్టార్ హీరోయిన్లేమో రెండు భాషల్లో బిజీ అయ్యారు. దాని వలన ఇక్కడ కొన్ని కొత్త సినిమాలుకు కొరత ఏర్పడింది. దానితో కొందరు యంగ్ హీరోయిన్స్ పెద్ద స్టార్లుగా మారుతున్నారు.

నాని నటించిన ‘మజ్ను’ సినిమా ద్వారా తెలుగులో సినిమాలు చేయడం మొదలుపెట్టిన అను ఎమ్మానుయేల్.. ఇప్పుడు బిజీ తెలుగు హీరోయిన్ గా మరబోతోంది. ఇప్పుడు నేరుగా పవన్ కల్యాణ్ పక్కన జంటగా నటించే అవకాశం వచ్చేసింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో నటిస్తుంది. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అను ఇప్పుడు పవన్ సినిమాలో నటించి తన రేంజుని పెంచుకునే పనిలో పడింది. అయితే ఇక్కడితో ఈమె మెగా స్ర్టీక్ ఆగట్లేదు. చాలామంది హీరోయిన్లను కన్సిడర్ చేశాక.. చివరకు అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో కూడా ఈ భామనే తీసుకున్నారని టాక్.

అను ఇటు పవన్ కల్యాణ్ అటు అల్లు అర్జున్ సినిమాలతో హిట్టు కొడితే మాత్రం.. టాలీవుడ్ లో బీభత్సమైన బిజీ అయిపోవడం ఖాయం అంటున్నారు. ఈ డస్కీ బ్యూటి మంచి పెర్ఫార్మరే కాదు.. అవసరమైన తన అందచందాలతో మ్యాజిక్ చేయగలదు కూడా. ఆ లెక్కన చూస్తుంటే అమ్మడు త్వరలోనే స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకోవాల్సిందే.