Begin typing your search above and press return to search.

​పవన్ కల్యాణ్ పక్కనే సెక్సీ అసిస్టెంట్

By:  Tupaki Desk   |   1 Aug 2017 11:34 AM GMT
​పవన్ కల్యాణ్ పక్కనే సెక్సీ అసిస్టెంట్
X
ఈ ఏడాది చివరిలో రానున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ వేగం పుంజుకుంది. ముఖ్యమైన పాత్రలుతో కొన్ని పతాక సన్నివేశాలు పూర్తి చేసుకొని ఇప్పుడు పాటలు కూడా షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. త్రివిక్రమ్ డైరక్షన్ లో వస్తున్న పవర్ ప్యాక్ సినిమాలో పవన్ ఎప్పుడు చేయని ఒక పాత్రలో కనిపించబోతున్నాడు అనే వార్త మనం వింటూనే విన్నాం. ఈ సినిమాలో అయన ఒక కంపెనీకి బాస్ గా కనిపించనున్నాడు అని తెలుస్తుంది. ఈ సినిమాలో ఇద్దరు మలయాళం సుందరులు పవన్ తో జతకట్టారు. అను ఎఎమ్మనుయాల్, కీర్తి సురేశ్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.

ఇందులో అను ఎమ్మనుయాల్ పాత్ర కొత్తగా అనిపిస్తుంది అని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కు సహాయకురాలు గా అతని కంపెనీ లో పనిచేస్తుందట. హీరో అంటే విపరీతమైన మొహం ఉన్న అమ్మాయిగా నటిస్తుంది. ఈ సినిమాలో తన పాత్ర ఆర్య2లో శ్రద్ధా దాస్ పాత్రకు దగ్గరలో ఉంటుంది అని కూడా అంటున్నారు. అంతేకాదు.. అను చేస్తున్న ఈ పాత్రతో ఆమె కెరియర్ కొత్త మలుపు తిరగబోతుంది అని చెబుతున్నారు. ఈ మధ్యే నే ఆమె పై కొన్ని సన్నివేశాలు షూట్ చేశారంట. అవి చూసిన వారంతా అను ఎమ్మనుయాల్నూ అంతా గ్లామర్లో చూసేసరికి సిల్వర్ స్క్రీన్ పై ఎంత రచ్చ చేయబోతుందో అని ఆసక్తిగా చెబుతున్నారు.ఇంత వరకు అనుని ఇలా చూసి ఉండరు ఇటువంటి కోణంలో ఈ మలయాళం సుందరిని ఎవరు ఊహించికూడా ఉండబోరట.

పవన్ కల్యాణ్ కూడా ఈ సినిమా కోసం కొంచెం సన్నబడి మరింత అందంగా తయారయ్యాడు అని తెలుస్తుంది. పవన్ అండ్ అను మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఈ సినిమా వినోదంలో కీలక పాత్ర పోషిస్తుంది అని చెబుతున్నారు ఆ చిత్ర యూనిట్. ఈ సినిమాలో కీర్తి సురేశ్ ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ గా చేస్తుంది. అది సంగతి.