Begin typing your search above and press return to search.

పవన్ అప్పాలకు హీరోయిన్ ఫ్లాట్

By:  Tupaki Desk   |   1 May 2017 6:08 AM GMT
పవన్ అప్పాలకు హీరోయిన్ ఫ్లాట్
X
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైన దాదాపు నెల కావస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన అప్ డేట్స్ పెద్దగా ఏమీ బైటకు రావడం లేదు. పవన్ సినిమా షూటింగ్స్ సహజంగా ఇలా సైలెంట్ గానే పూర్తయిపోతూ ఉంటాయి. ఇప్పుడు సినిమా గురించి కాకపోయినా.. పవర్ స్టార్ గురించి హీరోయిన్ అను ఇమాన్యుయేల్ కొత్త సంగతులు చెబుతోంది.

నాని మూవీ మజ్నుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అను ఇమాన్యుయేల్.. పవన్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తోంది. మూవీ షూటింగ్ టైంలో పవన్ బిహేవియర్ చూసి ఆశ్చర్యపోయిందట. అలాగే.. పవర్ స్టార్ మంచితనం చూసి మెస్మరైజ్ అయిపోయానంటోంది. ఇంతకీ అసలేం జరిగిందని అడిగితే.. అప్పుడు తెగ ఉత్సాహంగా అప్పాలకు సంబంధించిన ఓ ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చింది. షూటింగ్ జరుగుతున్నపుడు షాట్ గ్యాప్ లో పవన్ ఓ సారి పలకరించి.. బాగా నచ్చిన కేరళ ఫుడ్ గురించి అడిగాడట. తనకు అప్పం అంటే చాలా ఇష్టమని చెప్పిందట అను.

'షూటింగ్ లో నేను ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇంటరాక్షన్ కోసం ఇలా పవన్ పలకరించారని అనుకున్నాను. కానీ ఆ మరుసటి రోజే ఇంటి నుంచి తయారు చేసిన అప్పాలు.. కొన్ని కేరళ కూరలు నాకు పార్సెల్ వచ్చేశాయి. ఎంతో కాలం తర్వాత హోం ఫుడ్ తినడంతో భలే సంతోషం వేసింది. పవన్ కళ్యాణ్ ఇలా ప్రవర్తిస్తారని అసలే మాత్రం ఊహ కూడా లేని నేను థ్రిల్ అయిపోయాను' అంటూ తెగ సంబరపడిపోతోంది అను ఇమాన్యుయేల్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/