Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : ఈ ఊర్వశి మెరుపులు చూశారా..?

By:  Tupaki Desk   |   31 Oct 2022 8:30 AM GMT
ఫోటో స్టోరీ : ఈ ఊర్వశి మెరుపులు చూశారా..?
X
టాలీవుడ్ లో మరో మళయాళ భామ పాగా వేయాలని చూస్తుంది. ఇప్పటికే 10 సినిమాల్లో నటించినా సరే అమ్మడికి పెద్దగా క్రేజ్ తీసుకురాలేదు. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే అను ఇమ్మాన్యుయెల్ అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తో కలిసి నటించినా సరే అనుకి బ్యాడ్ లక్ తోడవడంతో ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

ఆ దెబ్బతో అను ఇమ్మాన్యుయెల్ కి అవకాశాలు రాకుండా పోయాయి. మహా సముద్రం సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన అను లేటెస్ట్ గా అల్లు శిరీశ్ తో ఊర్వశివో రాక్షసివో సినిమాతో మరోసారి తన లక్ టెస్ట్ చేసుకుంటుంది.

సినిమాలో మ్యాక్సిమం తన గ్లామర్ సైడ్ చూపించేసిందని తెలుస్తుంది. సౌత్ లోనే కాదు ఇప్పుడు ఇండియాలోనే అతి పెద్ద సినీ పరిశ్రమగా టాలీవుడ్ తన స్వాగ్ కొనసాగిస్తుంది. ఇక్కడ క్లిక్ అయితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అందుకే అను ఇమ్మాన్యుయల్ కూడా తెలుగు ఆడియన్స్ ని మెప్పించేందుకు గ్లామర్ ఎటాక్ చేస్తుంది.

ఊర్వశివో రాక్షసివో ఈవెంట్ లో కూడా తన గ్లామర్ తో అలరిస్తుంది. వైట్ కలర్ డ్రెస్ నిండా కలర్ ఫుల్ ఫ్లవర్ డిజైన్ డ్రెస్ వేసుకున్న అను నిజంగానే ఊర్వశి అనిపించేలా ఉంది. ఈ ఈవెంట్ లో అనునే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారింది.

సినిమా కోసం అను ఇమ్మాన్యుయెల్ కూడా చాలా బాగా కష్టపడ్డదని హీరో అల్లు శిరీశ్ చెప్పారు. కొద్దిపాటి గ్యాప్ తర్వాత రాక రాక వచ్చిన ఛాన్స్ కదా అని అను కూడా ఈ సినిమా కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోయినట్టు అర్ధమవుతుంది.

ఊర్వశివో రాక్షసివో టీజర్, ట్రైలర్ లోనే సినిమాలో రొమాన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూపించారు. సినిమాలో అల్లు శిరీశ్, అనుల కెమిస్ట్రీ సినిమాలో హైలెట్ అయ్యేలా ఉంది. ఇన్నాళ్లు మంచి పాత్ర కోసం కెరియర్ గ్యాప్ ఇచ్చిన అను ఇమ్మాన్యుయెల్ ఇక మీదట ఎలాంటి ఆఫర్ వచ్చినా సరే చేసేస్తా అంటుంది. మరి ఊర్వశివో రాక్షసివో సినిమా అయినా ఈ ఊర్వశికి హిట్ జోష్ ఇస్తుందో లేదో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.