Begin typing your search above and press return to search.

పవన్ తో.. ఐదేళ్ళ తరువాతే అనుకున్నా

By:  Tupaki Desk   |   6 Dec 2016 11:30 AM GMT
పవన్ తో.. ఐదేళ్ళ తరువాతే అనుకున్నా
X
అసలు పవన్ కళ్యాణ్‌ సరసన హీరోయిన్ గా చేయాలంటే ఎలా ఎప్రోచ్ కావాలి? ఒకప్పుడు హీరోయిన్లు ఇలాంటి ప్రశ్నలే వేసుకునేవారు. ఎందుకంటే చాలా రేర్ గా పవన్ ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ ను తీసుకునేవాడు. ఎంతసేపూ ముంబయ్ వెళ్ళి ఆడిషన్ చేసి మరీ కొత్త కొత్త భామలను పట్టుకొచ్చేవాడు. అందుకే ఐదేళ్ళ తరువాత అవకాశం ఇస్తారేమో అనుకుంటే పవన్ సార్ ఇప్పుడే పిలిచేశారు అంటోంది ఈ భామ.

నాని ''మజ్ను'' సినిమాతో హీరోయిన్ గా తెలుగులో సందడి చేయడం మొదలెట్టేసింది అను ఎమ్మానుయేల్. అమెరికాలో మోడలింగ్ చేస్తున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో మరో రెండు సినిమాల్లో మెరుస్తోంది. ఆల్రెడీ రాజ్ తరుణ్ సినిమా పూర్తవ్వగా.. ప్రస్తుతం గోవాలో గోపిచంద్ ''ఆక్సిజన్'' సినిమా షూటింగులో ఉంది. అయితే మొన్ననే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మన పవర్ స్టార్ తో తీసే కొత్త సినిమాలో నటించే హీరోయిన్ గా ఛాన్సు పట్టేసింది. కీర్తి సురేష్‌ మెయిన్ హీరోయిన్ కాగా.. ఈమె సెకండ్ లీడ్ టైపులో ఉంటుంది.

''అసలు ఐదేళ్ల తరువాత కాని పవన్ కళ్యాణ్‌ నాకు ఛాన్స్ ఇవ్వరు అనుకుంటే.. టాలీవుడ్ లో అడుగుపెట్టిన మొదటి ఏడాదిలోనే నాకు ఆయనతో నటించే ఛాన్సు రావడం గ్రేట్. కేవలం ఆయనతో రొమాన్స్ మాత్రమే కాదు.. కథలో నాది ఓ డిఫరెంట్ పాత్ర కూడా. కీర్తి సురేష్‌ తో కూడా సీన్లు ఉన్నాయి. త్రివిక్రమ్ గారు యాక్టింగ్ వర్క్ షాపు కూడా చేయిస్తున్నారు. స్ర్కిప్ట్ రీడింగ్ సెషన్స్ కూడా ఉంటాయ్'' అంటూ మురిసిపోయింది అను. ఆల్ ది బెస్ట్ లేడీ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/