Begin typing your search above and press return to search.

అది బన్నీ సొంత ఐడియా

By:  Tupaki Desk   |   4 May 2018 12:11 PM IST
అది బన్నీ సొంత ఐడియా
X
ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ అందులో పర్ఫెక్ట్ నటీనటులు కొంత మందే ఉన్నారు. కథ సెట్ అయితే పర్ఫెక్ట్ గా సినిమాకు తగ్గ పాత్రలో మునిగిపోవడం అందరికి అంత సులువు కాదు. కొందరికి వ్యక్తిగత అభిప్రాయం అడ్డొస్తే మరికొందరికి స్టార్ డమ్ అడ్డు పడుతుంది. కానీ కథ డిమాండ్ చేస్తోంది కాదా అని వారిని మార్చుకునే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో అల్లు అర్జున్ ఒకరు.

సినిమాకు తగ్గట్టు తన పాత్రను మలచుకొని కొత్తగా కనిపించడంలో బన్నీ ఎప్పుడు ముందుంటాడనే చెప్పాలి. ఇకపోతే ఈ రోజు బన్నీ నా పేరు సూర్య సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో బన్నీ గెటప్ దర్శకుడు ఒక శాతం చెబితే అతను మాత్రం 99% మార్చేసుకున్నాడట. ఈ విషయాన్ని చిత్ర కథానాయిక అను ఎమ్మన్యుయేల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

బన్నీ ఒక నటుడిగా అలోచించి కథకు ఎలాంటి గెటప్ అవసరమో అలాంటి దాని కోసమే ప్రయత్నిస్తాడు. నా పేరు సూర్య సరికొత్త కథ కావడంతో ఒక ఆర్మీ సైనికుడు ఎలా ఉండాలో అలా తన గెటప్ ను మార్చుకున్నాడు. వెరైటీగా ఉన్న హెయిర్ స్టైల్ తో పాటు కాస్ట్యూమ్ అలాగే కనుబొమ్మపై గాటు వంటివి బన్నీ ఆలోచనలో నుంచి పుట్టినవని అను వివరించింది. అంతే కాకుండా ఇతరుల క్యారెక్టర్ విషయంలో కూడా స్టైలిష్ స్టార్ చాలా హెల్ప్ చేస్తాడని ఆమె వివరించంది.