Begin typing your search above and press return to search.

తొలి సినిమా రిలీజవ్వకుండానే రెండు పట్టేసింది

By:  Tupaki Desk   |   17 July 2016 5:30 AM GMT
తొలి సినిమా రిలీజవ్వకుండానే రెండు పట్టేసింది
X
తెలుగులో హీరోయిన్ల కొరతతో ఫిలిం మేకర్స్ బాగా ఇబ్బంది పడుతున్న టైంలో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ బంపర్ ఆఫర్లు పట్టేస్తోంది అను ఇమ్మాన్యుయెల్. ఏంటీ పేరు కొత్తగా ఉంది.. ఎక్కడా విన్నట్లు లేదే అనిపిస్తోందా? గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆక్సిజన్’ సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం కాబోతోందీ మలయాళ భామ. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆమె ఇంకో రెండు క్రేజీ ప్రాజెక్టులు పట్టేసింది.

ఆల్రెడీ నాని కథానాయకుడిగా తెరకెక్కబోయే కొత్త సినిమాకు బుక్ అయిన అను.. తాజాగా మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసనా ఛాన్స్ కొట్టేసింది. ‘దొంగాట’ ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా అనిల్ సుంకర నిర్మించే సినిమాకు ఆమెనే హీరోయిన్ గా ఎంచుకున్నారు. తొలి సినిమా రిలీజ్ కాకముందే ఈ స్థాయిలో జోరు చూపిస్తోందంటే.. అది రిలీజై హిట్టయిందంటే స్టార్ స్టేటస్ సంపాదించేస్తుందేమో.

అను ఇమ్మాన్యుయెల్ ఓ ఎన్నారై బేస్డ్ మోడల్. ఐదేళ్ల కిందట జయరాం హీరోగా తెరకెక్కిన ఓ మలయాళ సినిమాలో స్కూల్ అమ్మాయిగా నటించింది. ఆ తర్వాత ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన నివిన్ పౌలీ సూపర్ హిట్ మూవీ ‘యాక్షన్ హీరో బిజు’తో హీరోయిన్ అవతారమెత్తింది. హీరోయిన్ గా తొలి సినిమాలో బాగానే అందాలు ఆరబోసిన అను.. తెలుగులోనూ తొలి సినిమాతోనే తన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది.