Begin typing your search above and press return to search.

థై థండ‌ర్ షోస్ తో చెల‌రేగుతున్న‌ అనూ

By:  Tupaki Desk   |   5 May 2021 6:31 AM GMT
థై థండ‌ర్ షోస్ తో చెల‌రేగుతున్న‌ అనూ
X
అను ఇమ్మాన్యుయేల్.. డీసెన్సీ పై యూత్ లో చాలా అంచ‌నాలున్నాయి. హ‌ద్దు మీరకుండానే అందంగా త‌న‌ని తాను ప్రెజెంట్ చేయ‌డం ఎలానో అనూ షేర్ చేసే ఫోటోషూట్లే సాక్ష్యం. అయితే ఈ భామ ఇటీవ‌ల కాస్తంత గ్లామ‌ర్ డోస్ పెంచుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. నిరంత‌రం అనూ థై థండ‌ర్ షోస్ యువ‌త‌రంలో వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా వైట్ టాప్ లో అనూ స్పెషల్ ఫోటోషూట్ హీటెక్కిస్తోంది.

అనూ ఇమాన్యుయేల్ స్వప్న సంచారి అనే మలయాళ చిత్రం ద్వారా బలనటిగా పరిచమైంది. యక్షన్ హీరో బిజు అనే మలయాళ చిత్రం ద్వారా కథనాయికగా మరింది. అనూ అమెరికాలో జన్మించింది. ఆమె భాల్యం డాల్లాస్- టెక్సాస్ లో గడిచింది. పాఠశాలలో చదువుతుండగా స్వప్న సంచారిలో నటించింది. టాలీవుడ్ లో గోపీచంద్ సరసన ఆక్సిజన్ అనే చిత్రంలో నటించింది. ఆ మూవీ చిత్రీకరణ సమయంలో నానీ సరసన మజ్ను అనే చిత్రంలో నటించటానికి ఒప్పుకుంది. తెలుగులో మజ్ను సినిమా ముందుగా విడుదల కాగా అనూ పాత్ర- నటనకు విమర్శకుల ప్రశంసలు ద‌క్కాయి.

ఆ త‌ర్వాత కెరీర్ తెలిసిందే. ప‌వ‌న్ - అజ్ఞాత‌వాసి.. బ‌న్ని - నా పేరు సూర్య ఊహించ‌ని ప‌రాజ‌యాలుగా మిగిలాయి. ఆ త‌ర్వాత అనూ కెరీర్ ఊహించని డైల‌మాలో ప‌డిపోయింది. ఇటీవలే బెల్లంకొండ స‌ర‌స‌న అల్లుడు అదుర్స్ లో న‌టించినా ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు. కానీ అనూ న‌ట‌న‌కు అందానికి యూత్ య‌థావిధిగా ఫిదా అయ్యారు. కొంత గ్యాప్ త‌ర్వాత ఆర్.ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్న మ‌హాస‌ముద్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో శ‌ర్వానంద్ - సిద్ధార్థ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. క‌నీసం ఈ సినిమా అయినా త‌న‌కు బిగ్ బ్రేక్ నిస్తుందేమో చూడాలి.